ఆ నిర్మాత విష్ణుకు హ్యాండిచ్చాడా?

మంచు ఫ్యామిలీతో కాస్త జాగ్రత్తగానే వుంటారు సినిమా జనం. అలాంటిది ఓ నిర్మాత విష్ణుతో సినిమా చేస్తానని చెప్పి, ఇప్పుడు ఫోన్ కు కూడా దొరకడం లేదని టాక్ వినిపిస్తోంది. వెనకటికి ఆదితో ఓ…

మంచు ఫ్యామిలీతో కాస్త జాగ్రత్తగానే వుంటారు సినిమా జనం. అలాంటిది ఓ నిర్మాత విష్ణుతో సినిమా చేస్తానని చెప్పి, ఇప్పుడు ఫోన్ కు కూడా దొరకడం లేదని టాక్ వినిపిస్తోంది. వెనకటికి ఆదితో ఓ సినిమా అనుకుని, కాస్త ముందుకు వెళ్లి ఆపేసారట సదరు నిర్మాత. కారణాలు ఏమీ తెలియవు కానీ, ఖర్చులు సాయికుమార్ దగ్గర వసూలు కూడా చేసారని టాక్. 

తరువాత విష్ణు దగ్గరకు వెళ్లి, రెజీనా కాంబినేషన్ తో సినిమా తీస్తా అన్నారట. అది కూడా కాస్త ముందుకు వెళ్లి ఆగిందని గుసగుస. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. దానికి తెగ హడావుడి చేస్తున్నారు. తన సినిమా సంగతి ఏమయిందో తెలుసుకుందామని విష్ణు ఫోన్ లు చేయించినా లిఫ్ట్ చేయలేదని కృష్ణనగర్ కబుర్ల సారాశం.