బ్రహ్మానందాన్ని, సప్తగిరిని సినిమాలో పెటుకోవడంత అంటే ఖర్చుకు సిద్దపడడం. బ్రహ్మానందం రోజుకు అయిదు లక్షలు, సప్తగిరి రోజకు లక్షకుపైగా తీసుకుంటారు కాబట్టి. అలా ఖర్చు చేసిన సీన్లు లేపయడం అంటే ఏమనుకోవాలి?
సినిమా చూపిస్తా మావా చిత్రంలో సప్తగిరి, బ్రహ్మానందం కూడా వున్నారట. సెకండాఫ్ లో సినిమా కథతో సంబంధం లేకుండా వారి క్యారెక్టర్లు కూడా వచ్చి, తలా స్కిట్టు చేసి పోతాయట. అయితే నిడివి అనో, కథలో ఇమడలేదనో, స్కిప్ట్ సరిగ్గా సెట్ కాలేదనో, మొత్తానికి వాళ్లిద్దరి సీన్లు లేపేసారట.
స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, డిమాండ్ లో వున్న సప్తగిరి సీన్లు లేపేయడం అంటే బాగా మిస్ మ్యాచ్ అయి వుండాలి. ఇప్పుడు సినిమా ఓ మాదిరిగా ఆడేసినా, తరువాత కావాలంటే కలిపేసుకోవచ్చు. అదో అడ్వాంటేజ్ అవుతుంది అప్పుడు.