Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనుష్క మరీ ఇలా..చూడగలమా?

అనుష్క మరీ ఇలా..చూడగలమా?

సినిమా అంతా ఇలా వుంటుందో, మరి సగం మేరకు ఇలా వుంటుందో తెలియదు కానీ, సైజ్ జీరో ఫస్ట్ లుక్ లో అనుష్క జనాలను బెదరగొట్టేలా కనిపించింది. సావిత్రి అమ్మమ్మలా వుంది. కాన్సెప్ట్ కోసం కావచ్చు, అలా వుండడం కరెక్టే కావచ్చు, కానీ జనం ఎలా కనెక్ట్ అవుతారన్నది చూడాలి మరి.

ఆర్య పక్కన అనుష్క ఓ రేంజ్ బాడీతో వుంది. అయితే సబ్జెక్ట్ లో దమ్ము లేకుంటే జనం ఇలాంటి పర్సనాలిటీని చూడరని డైరక్టర్ కు ప్రకాష్ కు తెలియదా ఏమిటి? విషయం ఏదో లేకుండా సైజ్ జీరో అంటూ ఒబేసిటీపై సినిమాకు శ్రీకారం చుడతాడా? ఆ విషయం ఏమిటో తెలియాలంటే, అక్టోబర్ రెండు వరకు ఆగాలి. ఎందుకంటే పివిపి నిర్మిస్తున్న సైజ్ జీరో సినిమ విడుదలయ్యేది ఆ రోజే.

సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న ‘సైజ్ జీరో' కు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి, నిరవ్ షా వంటి సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?