బెల్లంకొండ సురేష్ ఇంతకుముందు ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్టుగా స్లో అండ్ స్టడీగా వెళ్లేవాడు. కానీ ఈమధ్య వేగం పెంచి ఒకేసారి మూడు భారీ ప్రాజెక్టులు తలకెత్తుకున్నాడు. ఈ మూడూ కూడా సకాలంలో పూర్తి కాకుండా అలా అలా సాగిపోతున్నాయి. ఎన్టీఆర్‌తో మొదలెట్టిన రభస ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
ఈ చిత్ర దర్శకుడు కామెర్ల బారిన పడడంతో రభస షూటింగ్‌కి చాలా అంతరాయాలు ఏర్పడ్డాయి. అతను మొదలు పెట్టిన ‘ముని 3’ (గంగ) కూడా ముందుకి కదలట్లేదు. లారెన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ దర్శకులిద్దరూ ఇలా బెడ్డెక్కేస్తే… మరోవైపు వినాయక్ ఏమో తన సినిమాకి చాలా టైమ్ తీసుకుంటున్నాడు.
ఇంతవరకు స్టార్స్‌ని డైరెక్ట్ చేసిన వినాయక్ మొదటిసారి ఒక కొత్త హీరోని ఎలా ప్రెజెంట్ చేయాలా అని తెగ ఆలోచించేస్తూ రోజుల తరబడి షూటింగ్ చేస్తున్నాడు. తన కొడుకు సినిమా కాబట్టి సురేష్ కూడా ఏమీ అనలేకపోతున్నాడు. మొత్తానికి ఏక కాలంలో మూడు సినిమాలు నెత్తికెత్తుకుని సురేష్ నానా పాట్లు పడుతున్నాడు.