నిజంగా తిట్టుకున్నా నమ్మట్లేదేంట్రా బాబూ!

నాన్న పులి అంటాడు కొడుకు.. తండ్రి గాభరాగా పరుగెత్తుకుంటూ వస్తాడు. కానీ అక్కడ పులి ఉండదు. కొడుకు జోక్ చేశాడంటే. ఇలా 3-4 సార్లు జరుగుతుంది. ఈసారి నిజంగానే పులి వస్తుంది, కొడుకు అరుస్తాడు…

నాన్న పులి అంటాడు కొడుకు.. తండ్రి గాభరాగా పరుగెత్తుకుంటూ వస్తాడు. కానీ అక్కడ పులి ఉండదు. కొడుకు జోక్ చేశాడంటే. ఇలా 3-4 సార్లు జరుగుతుంది. ఈసారి నిజంగానే పులి వస్తుంది, కొడుకు అరుస్తాడు కానీ తండ్రి రాడు. తర్వాత కథ అందరికీ తెలిసిందే. టీవీ9లో నిన్న జరిగిన ఉదంతం ఇప్పుడీ కథని మరోసారి అందరికీ గుర్తు చేస్తోంది.

ఇంతకీ ఏం జరిగింది?

హీరో విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్ కోస నడిరోడ్డుపై ప్రాంక్ చేశాడు. అలా చేయొచ్చా, చేయకూడదా అంటూ డిస్కషన్ పెట్టింది టీవీ9. ఓ లాయర్ తో పాటు మరో వ్యక్తిని కూర్చోబెట్టింది. పనిలోపనిగా విశ్వక్ సేన్ ను కూడా పిలిచింది. సదరు హీరో కోరుకున్నది కూడా అదే కావడంతో వెంటనే చర్చకు వెళ్లాడు.

అయితే కొంతసేపు నడిచిన తర్వాత చర్చ పక్కదారి పట్టింది. విశ్వక్ సేన్ ను యాంకర్ ఓ దశలో పాగల్ సేన్ అంటూ పిలిచింది. దానికి విశ్వక్ సేన్ హర్ట్ అయ్యాడు. వ్యక్తిగతంగా తనను కించపరిచే హక్కు లేదంటూ ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో ఓ బూతు పదం కూడా వాడాడు. దీంతో యాంకరమ్మ ఇగో హర్ట్ అయింది. తనే ఓనర్ లా ఫీల్ అవుతా గెట్ అవుట్ ఆఫ్ మై స్టుడియో అంటూ హుకుం జారీ చేసింది.

తర్వాత జరిగిందే అసలు రచ్చ

టీవీ9 చర్చల్లో గొడవలు సహజం. నిజానికి అసలైన ప్రాంక్స్ అన్నీ స్టుడియోల్లోనే జరుగుతుంటాయి. కెమెరాల ముందు తిట్టుకోవడం, బయటకొచ్చి కలిసి కాఫీలు తాగడం సర్వసాధారణం. టీవీ ఛానెళ్లలో పనిచేసే వాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. ఆ తర్వాత కొన్నాళ్లకు జనాలకు కూడా ఈ విషయం అర్థమైపోయింది. వాళ్లు తిట్టుకుంటుంటే వీళ్లు ఆనందించడం మొదలుపెట్టారు.

బాధాకరమైన విషయం ఏంటంటే.. టీవీ9 స్టుడియోలో యాంకర్ కు, విశ్వక్ కు మధ్య జరిగిన గొడవ అసలైన మాటల యుద్ధం. నిజంగానే వాళ్లు ఒకర్ని ఒకరు తిట్టుకున్నారు. కానీ జనాలు నమ్మడం లేదు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే డిస్కషన్. ఛానెల్ టీఆర్పీల కోసం సదరు యాంకర్-నటుడు అలా ప్రవర్తించారని అంతా అంటున్నారు. 

అది డ్రామా కాదు, నిజం అని చెప్పినా ఎవ్వరూ వినడం లేదు. చివరికి టీవీ ఛానెళ్ల పరిస్థితి ఇలా దిగజారింది..