నారా చంద్రబాబు రాయలసీమకు చెందిన వ్యక్తి. కానీ ఆయన్ను ఎప్పూడూ సీమ వాసులు తమ ప్రతినిధిగా చూడలేదు. అంత దారుణమైన చరిత్ర బాబుది. సీమ ప్రజలంతా వైఎస్సార్ ను తమవాడిగా ఓన్ చేసుకున్నారు కానీ, చంద్రబాబుకి అలాంటి ఆదరణ లేదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సీమని ఏమాత్రం పట్టించుకోని నాయకుడిగా ముద్ర వేయించుకున్నారు బాబు.
అలాంటి చంద్రబాబు తనయుడు నారా లోకేష్.. ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడటం జబర్దస్త్ కామెడీ ఎపిసోడ్ ను తలపిస్తోంది. పైగా తానూ రాయలసీమ బిడ్డనే అంటూ లోకేష్ చెప్పిన డైలాగ్ కెవ్వు కామెడీ. రోడ్డుప్రమాదంలో మృతి చెందిన రాజవర్దన్ కుటుంబాన్ని పరామర్శించడానికి కర్నూలు వెళ్లిన లోకేష్.. ఇలా సీమపై ప్రేమను తెచ్చిపెట్టుకున్నారు.
సీమ పెతాపమా..? నిమ్మకూరు పెతాపమా..?
ఇంతకీ నారా లోకేష్ సీమ బిడ్డా..? నిమ్మకూరు బిడ్డా..? లేక హైదరాబాద్ కి చెందిన వ్యక్తా..? అంటే ఏడాదికోసారి నారావారిపల్లెకు వచ్చి సంక్రాంతి పండగ చేసుకుని వెళ్లిపోతే సీమ బిడ్డ అవుతారా..? అలాంటప్పుడు తానూ సీమ బిడ్డను అనడంలో లోకేష్ ఆంతర్యమేంటి..? అక్కడ చంద్రబాబుకే సీమ గడ్డపై ఆదరణ లేదు.
అలాంటిది లోకేష్ కి తనని తాను కేరాఫ్ రాయలసీమ అని చెప్పుకునే అర్హత ఉందా..? ఇలా పరామర్శలకు వచ్చినప్పుడే లోకేష్ కి రాయలసీమ గుర్తుకొస్తుందేమో.
సీమ బిడ్డకి ఇక్కడ పోటీ చేసే దమ్ము లేదా..?
సీమ బిడ్డని అని చెప్పుకుంటున్న నారా లోకేష్ కి కనీసం రాయలసీమలో పోటీ చేసే దమ్ముందా అని అప్పుడే కౌంటర్లు మొదలవుతున్నాయి. మంగళగిరి ప్రజలకు రాజధాని సినిమాని ఫుల్ లెంగ్త్ గ్రాఫిక్స్ లో చూపించి మాయ చేయాలనుకుని బొక్కబోర్లా పడ్డారు లోకేష్.
ఇక్కడ చంద్రబాబుకి కూడా చీటీ చిరిగిపోయే పరిస్థితి వచ్చేసింది. 2024లో బాబు కుప్పంలో పోటీ చేయడం దాదాపు అసాధ్యం అంటున్నారు. పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.
అందుకే ఇప్పుడు తండ్రీ కొడుకులిద్దరూ సీమ నాటకం ఆడుతున్నారు. లోకేష్ మాటల్లోని ఆంతర్యమదే. వాస్తవం చెప్పుకోవాలంటే లోకేష్ కి తాను ఫలానా ప్రాంతం వాడిని, ఫలానా ప్రాంతానికి ప్రతినిధిని అనుకోడానికి ఒక్క ప్లేస్ కూడా ఏపీలో దొరకదు. వలసజీవి లోకేష్ తననుతాను కేరాఫ్ రాయలసీమగా చెప్పుకోవడం నిజంగా పెద్ద కామెడీ.