సూర్య రూట్ మారింది

కార్తీ, సూర్య సినిమాలు చాలా వరకు తెలుగులోకి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో చాలా వరకు వారి సంస్థ నిర్మాణ సంస్థే తెలుగులో కూడా అందించింది. అయితే ఇప్పుడు సూర్య ప్రారంభించిన కొత్త సంస్థ…

కార్తీ, సూర్య సినిమాలు చాలా వరకు తెలుగులోకి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో చాలా వరకు వారి సంస్థ నిర్మాణ సంస్థే తెలుగులో కూడా అందించింది. అయితే ఇప్పుడు సూర్య ప్రారంభించిన కొత్త సంస్థ 2డి ఎంటర్ టైన్మెంట్స్  నిర్మిస్తున్న రెండో సినిమా (మొదటిది జ్యోతిక రీ ఎంట్రీ సినిమా) 24.

ఇష్క్, 13బి, మనం లాంటి వైవిధ్యమైన సినిమాలు అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య చేస్తున్న సినిమా. సమంత, నిత్య హీరోయిన్లు. ఈ సినిమాను మాత్రం తెలుగులో సూర్య సంస్థలు అందించడం లేదు. నితిన్ సినిమాలు ఎక్కువగా నిర్మించే శ్రేష్ఠ్ మూవీస్ దీని హక్కులు సంపాదించింది.

బిగ్ అనౌన్స్ మెంట్ అంటూ నితిన్ ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేసాడు. నితిన్ తండ్రికి నైజాంలో పంపిణీ బిజినెస్ వుంది. సోదరి పేరుతో నిర్మాణ సంస్థ వుంది. తను స్వయంగా అఖిల్ తో సినిమా నిర్మిస్తున్నాడు. ఇలా ఇటు నటన, అటు పంపిణీ,   ఇంకో పక్క నిర్మాణం, డబ్బింగ్ రైట్స్ అంటూ అన్ని విధాలా బిజీ అయిపోతున్నాడు నితిన్.