గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రుద్రమదేవి’ చిత్రం చాలా కాలంగా నిర్మాణ దశలో ఉంది. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. మార్చి నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇంత భారీ వ్యయంతో రూపొందిన చిత్రానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి.
యాభై కోట్లకి పైగా ఖర్చయిన ఈ చిత్రాన్ని ఇంతవరకు ఏ వివాదం లేకుండా లాక్కొచ్చారు. అయితే సినిమా విడుదలకి దగ్గర పడుతున్న దశలో పేమెంట్ సెటిల్మెంట్స్ వగైరా సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ చిత్రంలో ఒక చిన్న పాత్ర చేసిన నటుడు సుమన్ తనకి రావాల్సిన మొత్తం ఇంకా రాలేదని గుణశేఖర్‌పై కేసు పెట్టాడు.
తనకిచ్చిన అయిదు లక్షల రూపాయల చెక్ బౌన్స్ అయిందట. దాని గురించి సుమన్ మేనేజర్ ఎన్నిసార్లు అడిగినా అటునుంచి రెస్పాన్స్ లేదట. స్వయంగా సుమన్ అడిగినా కానీ సానుకూల స్పందన లేకపోవడంతో సుమన్ చీటింగ్ కేస్ ఫైల్ చేసాడు. ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంతదాకా రానివ్వకుండా గుణశేఖర్ ముందే సెటిల్ చేసేసుకుంటే బెటర్.