బండ్ల గణేష్‌ బిస్కెట్‌ ఏస్తున్నాడా?

కాంబినేషన్స్‌ సెట్‌ చేయడం… తన సినిమాల విడుదలకి ముందు ‘బ్లాక్‌బస్టర్‌’ అంటూ ఊదరగొట్టేయడం… తక్కువలో సినిమాలు చుట్టేయడం… రిలీజ్‌కి ముందే టేబుల్‌ ప్రాఫిట్‌ వెనకేసుకోవడం బండ్ల గణేష్‌ స్టయిల్‌. ఇంతవరకు అతను తీసిన సినిమాల్లో…

కాంబినేషన్స్‌ సెట్‌ చేయడం… తన సినిమాల విడుదలకి ముందు ‘బ్లాక్‌బస్టర్‌’ అంటూ ఊదరగొట్టేయడం… తక్కువలో సినిమాలు చుట్టేయడం… రిలీజ్‌కి ముందే టేబుల్‌ ప్రాఫిట్‌ వెనకేసుకోవడం బండ్ల గణేష్‌ స్టయిల్‌. ఇంతవరకు అతను తీసిన సినిమాల్లో బయ్యర్లు లాభపడిన సినిమా ‘గబ్బర్‌సింగ్‌’ ఒక్కటే. మిగతా సినిమాలన్నిటికీ బయ్యర్లు ఎంతో కొంత నష్టపోయారు. 

అయినా కానీ తన ‘బ్లాక్‌బస్టర్‌’ కబుర్లని గణేష్‌ కట్టిపెట్టలేదు. తన తాజా చిత్రం ‘టెంపర్‌’కి కూడా గణేష్‌ ఎప్పటిలానే హైప్‌ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎవరికీ అమ్మవద్దని తన అన్నయ్య అంటున్నాడని, ఈ చిత్రం చాలా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని, అందుకే రైట్స్‌ ఎవరికీ ఇవ్వకుండా సొంతంగా విడుదల చేద్దామని అనుకుంటున్నట్టు గణేష్‌ ఆడియో ఫంక్షన్‌లో చెప్పాడు. 

బయ్యర్లని విపరీతంగా ఊరించే స్టేట్‌మెంట్‌ ఇది. ఏ నిర్మాత అయినా కానీ తన సినిమాపై ఎంత నమ్మకం ఉన్నా ఇంత భారీ చిత్రాన్ని స్వయంగా రిలీజ్‌ చేసుకునే రిస్క్‌ చేయడు. కానీ స్వయంగా రిలీజ్‌ చేద్దామనుకుంటున్నా అంటే బయ్యర్లు ఈజీగా ఎట్రాక్ట్‌ అవుతారు. ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధపడతారు. గణేష్‌ మరి ఆ విధమైన స్ట్రాటజీ పాటిస్తున్నాడా లేక నిజంగానే ‘టెంపర్‌’ని సొంతంగా విడుదల చేసే ఉద్దేశముందా?