హీరోయిజం వారసత్వం అయిపోయింది. నటీనటులు తమ వారసుల్ని హీరోలుగాచూసుకొని మురిసిపోవాలనుకొంటున్నారు. బ్రహ్మానందం, ఎమ్మెస్, తనికెళ్లభరణి తనయులు హీరోగా రాణించాలని తాపత్రయపడినవాళ్లే. ఇప్పుడు మరో సీనియర్ నటుడు బ్రహ్మాజీ పుత్రరత్నం కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడని టాక్.
బ్రహ్మాజీ తనయుడు పేరు… సంజయ్. నావీలో జాబ్ చేస్తున్నాడు. పెళ్లి కూడా అయిపోయింది. ఈమధ్య ఓ దర్శకుడు సంజయ్‌ని చూసి `నీ కొడుకుని హీరోలా లాంఛ్ చేస్తా..` అని మాటిచ్చాడట. దాంతో బ్రహ్మాజీ కూడా హ్యాపీగా ఫిలైపోయి.. సంజయ్‌కి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు.
సంజయ్ ఇప్పుడు నటన, డాన్సుల్లో ట్రైనింగ్ తీసుకొంటున్నాడట. హీరోగా వెలిగిపోదాం అని ఇండ్రస్ట్రీకి వచ్చాడు బ్రహ్మాజీ. కానీ తనకు ఆ అదృష్టం రాలేదు. ఇప్పుడు కొడుకుని హీరోగా చూసుకొని మరిసిపోయే ఛాన్సు వచ్చింది. తన కోరిక ఈ రూపంలో తీరబోతోందన్న మాట.