ఆగస్టు 15 డిమాండ్ బాగానే వుంది

విడుదల తేదీల సంగతేమో కానీ, టీజర్లు, ఫస్ట్ లుక్ లు, ఇతరత్రా వాటికి ఈ నెల 15 ఇండిపెండెన్స్ డే కీలకంగానే కనిపిస్తోంది. ఇప్పటికే కిక్ 2 కొత్త ట్రయిలర్, ఎన్టీఆర్-సుక్కు కాంబినేషన్ సినిమా…

విడుదల తేదీల సంగతేమో కానీ, టీజర్లు, ఫస్ట్ లుక్ లు, ఇతరత్రా వాటికి ఈ నెల 15 ఇండిపెండెన్స్ డే కీలకంగానే కనిపిస్తోంది. ఇప్పటికే కిక్ 2 కొత్త ట్రయిలర్, ఎన్టీఆర్-సుక్కు కాంబినేషన్ సినిమా ఫస్ట్ లుక్ ఆ రోజు వస్తాయని తెలిసింది.

ఇప్పుడు వరుణ్ తేజ-క్రిష్ కాంబినేషన్ లోని కంచె ఫస్ట్ లుక్ కూడా అదే రోజు విడుదల చేస్తారట. ఈ సినిమా దాదాపు పూర్తి కావస్తోంది. వచ్చేనెల ఫస్ట్ వీక్ లో అడియో విడుదల చేసి, అక్టోబర్ 2న రిలీజ్ కు వెళ్లాలని అనుకుంటున్నారు. వరుణ్ తేజ కే కాదు క్రిష్ కు కూడా ఈ సినిమా కీలకమే.

మొదటి రెండు సినిమాలు కూడా క్లాస్ సినిమాలే కావడం, అది కూడా రెండో సినిమా కాస్త దేశభక్తి అంటూ వైవిధ్యం చూడడం అన్నది వరుణ్ తేజకు సవాల్ అయితే, సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది క్రిష్ కు.