నితిన్ సినిమా వర్క్ మొదలైంది

త్రివిక్రమ్-నితిన్ సినిమా వర్క్ మొదలైంది. స్క్రిప్ట్ ను, డైలాగ్ వెర్షన్ ను రెడీ చేయడంలో త్రివిక్రమ్ బిజీ అయ్యారు. సినిమాకు ముహుర్తం డిసైడ్ అయ్యాక బయటకు ప్రకటించే అవకాశం వుంది. Advertisement ఇంకా నటీనటులు,…

త్రివిక్రమ్-నితిన్ సినిమా వర్క్ మొదలైంది. స్క్రిప్ట్ ను, డైలాగ్ వెర్షన్ ను రెడీ చేయడంలో త్రివిక్రమ్ బిజీ అయ్యారు. సినిమాకు ముహుర్తం డిసైడ్ అయ్యాక బయటకు ప్రకటించే అవకాశం వుంది.

ఇంకా నటీనటులు, టెక్నీషియన్లు ఇతరత్రా వ్యవహారాల ఫిక్సేషన్ లో వున్నారు. ఇదిలా వుంటే నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) ఒకేసారి రెండు సినిమాలు చేసే ప్రయత్నంలో వున్నారు. నాగచైతన్య-చందుమొండేటితో ప్రేమమ్ సినిమాను తెలుగులోకి తెస్తున్నారు.

దాని వ్యవహారాలు కూడా ఫైనల్ అయ్యాక ఒకేసారి రెండు సినిమాలను ప్రకటిస్తారు. ప్రేమమ్ సినిమాకు కూడా స్టార్ కాస్ట్, టెక్నీషియన్లను ఇంకా ఫిక్స్ చేయాల్సి వుంది. ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్లు కావాల్సి వుంది. వారిని ఎంపిక చేయాలి.