‘బులుసు’ ప్రయోగం…’చిత్రం భ‌ళారే విచిత్రం’

'కాళిచ‌ర‌ణ్‌', 'ల‌వ‌ర్స్'  చిత్రాల్లో న‌టించిన చాందిని ప్ర‌ధాన పాత్ర‌లో, 'రోమాంటిక్ క్రైమ్ స్టోరి' చిత్రంలో న‌టించిన మ‌నోజ్‌నంద‌న్‌, అనిల్ క‌ళ్యాణ్ లు , సౌమ్య లు ముఖ్య‌పాత్ర‌ల్లో, క‌థే హీరోగా  ప్ర‌యోగం లాంటి ప్ర‌యోగాత్మక…

'కాళిచ‌ర‌ణ్‌', 'ల‌వ‌ర్స్'  చిత్రాల్లో న‌టించిన చాందిని ప్ర‌ధాన పాత్ర‌లో, 'రోమాంటిక్ క్రైమ్ స్టోరి' చిత్రంలో న‌టించిన మ‌నోజ్‌నంద‌న్‌, అనిల్ క‌ళ్యాణ్ లు , సౌమ్య లు ముఖ్య‌పాత్ర‌ల్లో, క‌థే హీరోగా  ప్ర‌యోగం లాంటి ప్ర‌యోగాత్మక చిత్రాన్ని రూపోందించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు అందుకున్న భాను ప్ర‌కాష్ బ‌లుసు ద‌ర్శ‌కత్వంలో కార్తిక డ్రీమ్ క్రియోష‌న్స్ నిర్మిస్తున్న చిత్రం  'చిత్రం భ‌ళారే విచిత్రం'. ఈ చిత్రం తో పి. ఉమా కాంత్ నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు భాను ప్ర‌కాష్ బ‌లుసు మాట్లాడుతూ..' ప్ర‌యోగం' చిత్రం తో తెలుగు సినిమా ప్ర‌ముఖుల ప్ర‌శంశ‌లు అందుకున్నాను. క్రిటిక్స్ కూడా న‌న్ను ద‌ర్శ‌కుని గా అభినందించారు. అయితే మ‌ళ్ళి రెండ‌వ చిత్రం ద‌ర్శ‌కత్వం చేయాలంటే మ‌రో వైవిధ్య‌మైన క‌థ‌ని సిధ్ధం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అందుకే కొంచెం టైం తీసుకుని ఈ క‌థ‌ని సిద్దం చేశాను. ఉమాకాంత్ గారికి ఈ క‌థ చెప్ప‌గానే కార్తిక డ్రీమ్ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ ప్రారంభించారు.  మాచిత్రానికి క‌థ నే హీరో. కామెడినే హీరోయిన్‌. ఫుల్‌లెంగ్త్ కామెడి థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించిన ఈ చిత్రానికి ర‌క‌ర‌కాల టైటిల్స్ అనుకున్నాం చివ‌ర‌కి 'చిత్రం భ‌ళారే విచిత్రం అనే టైటిల్ ని ఖ‌రారు చేశామన్నారు.

నిర్మాత పి.ఉమాకాంత్ మాట్లాడుతూ.. చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వుందని, ప్ర‌తిఫ్రేమ్ లో నవ్వుతూనే చివ‌ర‌లో చిన్న స‌స్పెన్స్ థ్రిల్లింగ్ తో ప్రేక్ష‌కులు దియోట‌ర్ నుండి బ‌య‌ట‌కి వ‌స్తారని అన్నారు. హీరోయిన్ ఛాందిని మాట్లాడుతూ.. చాలా మంచి పాత్ర‌లో న‌టిస్తున్నా అన్నారు. హీరో మ‌నోజ్ నంద‌న్ మాట్లాడుతూ..  ఇప్ప‌టి వ‌ర‌కూ చేయ్య‌ని ఓ వైవిద్య‌మైన పాత్ర‌లో న‌టించా అన్నారు.