డిక్టేటర్ కోసం బాలయ్య స్పెషల్ సాంగ్

బాలయ్య బాబు 99 వ సినిమా డిక్టేటర్. శ్రీవాసు ప్లస్ కోన వెంకట్ బృందం చేస్తున్న సినిమా. ఈ సినిమా కోసం బాలయ్య చాలా కేర్ తీసుకుంటున్నారు. మనిషి స్లిమ్ అయ్యారు. విగ్ మార్చారు.…

బాలయ్య బాబు 99 వ సినిమా డిక్టేటర్. శ్రీవాసు ప్లస్ కోన వెంకట్ బృందం చేస్తున్న సినిమా. ఈ సినిమా కోసం బాలయ్య చాలా కేర్ తీసుకుంటున్నారు. మనిషి స్లిమ్ అయ్యారు. విగ్ మార్చారు. లుక్ అదిరేలా తయారయ్యారని వినికిడి.

ఈ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ డైరక్షన్ లో చేస్తున్నారట. వినాయక మండపం నేపథ్యంలో సాగే ఈ బృందగీతం కోసం సెంటిమెంటల్ గా 99 మంది డ్యాన్సర్లను తీసుకున్నారట.

మళ్లీ వీరు కాక, బ్యాక్ డ్రాప్ లో రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులంట. మొత్తానికి భారీగా పాట అంట. ఈ పాటకు ఎన్ని రోజులైనా ఫరావలేదని, డ్యాన్స్ మూమెంట్ లు అదిరిపోవాలని అంటున్నారట బాలయ్య. రెండు మూడు వారాల్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ జనాల ముందుకు వస్తుంది.