మెగాస్టార్ చేతికి ‘కత్తి’?

భూమి గుండ్రంగా వుందన్నట్లు, గిరగిరా తిరుగుతోంది కత్తి సినిమా. మురగదాస్ తీసిన హిట్ మూవీని ఠాగోర్ మథు తీసుకుని డబ్ చేసాడు. కానీ అది స్ట్రెయిట్ గా చేస్తే పెద్ద సినిమా అవుతుందన్నారు అంతా.…

భూమి గుండ్రంగా వుందన్నట్లు, గిరగిరా తిరుగుతోంది కత్తి సినిమా. మురగదాస్ తీసిన హిట్ మూవీని ఠాగోర్ మథు తీసుకుని డబ్ చేసాడు. కానీ అది స్ట్రెయిట్ గా చేస్తే పెద్ద సినిమా అవుతుందన్నారు అంతా. దాంతో హీరోల  వెంటపడుతున్నాడు ఆయన.పవన్, బన్నీ, ఎన్టీఆర్ ఇలా చాలా మంది దగ్గరకు వెళ్లిందని వినికిడి. దిల్ రాజు ఈ ప్రాజెక్టుకు జాయిన్ అయ్యాడు. డైరక్టర్ గా గోపీచంద్ మలినేనిని ఫిక్స్ చేసుకున్నారు.ఎన్టీఆర్ తో ప్రాజెక్టు కన్ ఫర్మ్ అనుకున్నారు.కానీ ఇంతలో ఏమయిందో ఆగింది. ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఈ ప్రాజెక్టు మెగాస్టార్ చిరంజీవి చేతిలోకి వచ్చిందని. ఇదే బ్యాచ్..అదే కథ..హీరో మెగాస్టార్ అన్నమాట. కానీ ఇక్కడ చిన్న సమస్య వచ్చింది. చిరు 150 వ సినిమా నిర్మాత చరణ్ అని ముందే అనేసారు.మరి ఇప్పుడు ఠాగోర్ మధు అనో, దిల్ రాజు అనో అంటే ఎలా? అందుకే డిస్కషన్లు ప్రారంభమయ్యాయని వినికిడి. మరి ఏ విధంగా సెటిల్ చేసుకుంటారో? సెటిల్ అయితే మంచిదే. చిరుకు చక్కగా నప్పే సినిమా అది.