Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆగస్టు 14న కిక్ 2 ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్

ఆగస్టు 14న కిక్ 2 ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్

రవితేజ హీరోగా, కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న కిక్ 2 సినిమా ఆగస్టు 21న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు మరింత కిక్ రప్పించేందుకు వీలుగా ఈ నెల 14న అడియో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు.అదే ఫంక్షన్ లో ఓ మాంచి ట్రయిలర్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ట్రయిలర్ విశేషం ఏమిటంటే, అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రయిలర్ గా కట్ చేయించారట. రవితేజ మార్క్ ఎంటర్ టైనర్ కిక్  సినిమా. అదే తరహా ఎంటర్ టైన్ మెంట్ కిక్ 2 లో కూడా మిస్ కాలేదని చెప్పాలన్న ప్రయత్నమే ఈ ట్రయిలర్ అని తెలుస్తోంది.నిజానికి రవితేజ యాక్షన్ సీన్ల కన్నా, అతని మార్కు వెటకారం, ఫన్, కామెడీనే జనాలకు ఎక్కువ ఇష్టం. అందుకనే ఆ దిశగా ఆలోచించి, ఈ ట్రయిలర్ కట్ చేయించారని వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?