దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య ట్విట్టర్ లోనూ, ఇంటర్వూలలోనూ వున్నంత ఏక్టివ్ గా సినిమా మేకింగ్ లో కనిపించడం లేదు. లేదా ఒకేసారి చాలా ప్రాజెక్టులు తలకెత్తుకోవడం వల్ల ఏదీ పూర్తి కావడం లేదేమో?
అప్పుడెప్పుడో శ్రీదేవి..కాదు కాదు, సావిత్రి అన్నాడు. ఆ తరువాత అది అతీ గతీ లేదు. మనోజ్ తో సినిమా అన్నారు. అదెంతవరకు వచ్చిందో తెలియదు. సచిన్ జోషి సినిమా చాలా వరకు పూర్తి చేసారు. మరి అదెప్పుడు రిలీజ్ అవుతుందో? ఇంకో పక్క వీరప్పన్ పై సినిమా అంటూ ప్రకటించారు. ఈ మధ్య కన్నడ రంగంపై కన్నేసారు.
మరి ఇలా ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు పెట్టుకున్నారు. ఏదీ పూర్తి కాలేదు. ఏదీ జనం ముందుకు రాలేదు. బహుశా వర్మ సినిమా వచ్చి చాలా కాలమయింది, ఓ సారి చూడాలి, అన్న కుతూహలం జనంలో కలిగేవరకు ఆయన తన సినిమాను విడుదల చేయరేమో?