ఇంకా డైనమైట్ పేలదేమి?

ఎప్పటి డైనమైట్? దాన్ని ఎప్పుడు బయటకు తీస్తారో? ఎంత పవర్ ఫుల్ గా పేలుతుందో? తెలియడం లేదు. మంచు విష్ణు తమిళంలో హిట్ అయిన మాంచి సినిమాను పట్టుకొచ్చి, డిఫరెంట్ డైరక్టర్ దేవా కట్టా…

ఎప్పటి డైనమైట్? దాన్ని ఎప్పుడు బయటకు తీస్తారో? ఎంత పవర్ ఫుల్ గా పేలుతుందో? తెలియడం లేదు. మంచు విష్ణు తమిళంలో హిట్ అయిన మాంచి సినిమాను పట్టుకొచ్చి, డిఫరెంట్ డైరక్టర్ దేవా కట్టా చేతిలో పెట్టాడు. చకచకా సినిమా ఫినిష్ చేసారు.

అంతవరకు బాగానే వుంది. అక్కడ నుంచి డైనమైట్ ను బీరువాలో పెట్టేసారు. ఎప్పుడు బయటకు తీస్తారో తెలియదు. ఎప్పుడు తీయాలన్నా ఏదో అడ్డంకి. ఇలా బయటకు తీస్తారనుకోవడం. అలా ఏదో సినిమా రావడం, దాంతో దీన్ని లోపల దాచేయడం. ఇప్పటి నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు స్లాట్ లు అన్నీ బుక్ అయిపోయాయి.

సోలోగా రావాలంటే ఇప్పట్లో కుదిరే వ్యవహారం కాదు. తెగించి, ఏదో సినిమా మీద డైనమైట్ విసిరేయడమే. లేదంటే జనం మరిచిపోయే ప్రమాదం వుంది. ఇదెప్పటి సినిమా అని డవుట్ పడతారు కూడా. విష్ణుకు తెలియని విషయాలు కావు ఇవన్నీ, కానీ మరి ఎందుకిలా చేస్తున్నట్లో?