చరిత్రకు ఒక్కడు…బాలయ్య

బాలకృష్ణ 98 వ సినిమా లయన్ విడుదలకు సిద్ధమైపోయింది. 99 వ సినిమా కోసం దర్శకుడు శ్రీవాసు బృందం ప్రీ ప్రొడక్షన్ పనులు సాగిస్తోంది. మరోపక్క బాలయ్య ప్రెస్టీజియస్ వందో సినిమా కు టైటిల్…

బాలకృష్ణ 98 వ సినిమా లయన్ విడుదలకు సిద్ధమైపోయింది. 99 వ సినిమా కోసం దర్శకుడు శ్రీవాసు బృందం ప్రీ ప్రొడక్షన్ పనులు సాగిస్తోంది. మరోపక్క బాలయ్య ప్రెస్టీజియస్ వందో సినిమా కు టైటిల్ ఫిక్సయిపోయిందన్నది లేటెస్ట్ టాపిక్. 

ఈ నూరో సినిమాకు నూటికి నూరుపాళ్లు నిర్మాత సాయి కొర్రపాటి అని, దర్శకుడు బోయపాటి శ్రీను అని ఇప్పటికే ప్రచారంలో వుంది.ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కూడా బయట వినిపిస్తోంది. చరిత్రకు ఒక్కడు అన్నది బాలయ్య వందో చిత్రం టైటిల్ అంట. 

నిజమో,కాదో కానీ, టైటిల్ మాత్రం బాలయ్యకు, అదీ వందో సినిమాకు సరిపడేటట్లే వుంది.