నాన్నా..పులి

నాన్నా పులి వచ్చే అనే కథ జనాలకు తెలిసిందే. ఈ మధ్యే సన్నాఫ్ సత్యమూర్తిలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుర్తు చేసారు. అలాంటి సంఘటనే ఇవాళ బుడుగు ప్రెస్ మీట్ లో జరిగింది. బుడుగు…

నాన్నా పులి వచ్చే అనే కథ జనాలకు తెలిసిందే. ఈ మధ్యే సన్నాఫ్ సత్యమూర్తిలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుర్తు చేసారు. అలాంటి సంఘటనే ఇవాళ బుడుగు ప్రెస్ మీట్ లో జరిగింది. బుడుగు సినిమా ప్రివ్యూ మీడియాకు ప్రదర్శించారు.సినిమా ముగిసాక, మీడియా జనాలతో నిర్మాత ఏదో కీలక విషయం మాట్లాడతారట, సంచలనమట..ఇలాంటి సమాచారం అందింది. 

అదేంటో అనుకుని అంతా రెడీ..స్టడీ అంటూ నిల్చున్నారు. నిర్మాత మాట్లాడుతూ మీడియాకు థాంక్స్ చెప్పి, సినిమాను జనంలోకి తీసుకెళ్లాలని కోరుతూ ముగించారు. సరే, ఇంతలో ఎవరో గుర్తు చేసారు అసలు విషయం…సినిమా, ప్రమోషన్, ఇతరత్రా వ్యవహారాలు. సినిమా ప్రమోషన్ కు సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మంచు లక్ష్మిని రమ్మని కోరామని, మెయిల్ పెట్టామని, ఎస్ ఎమ్ ఎస్ ఇచ్చామని, ఆమె తన సినిమా బిజీలో వున్నాను, మే దాకా ఖాళీలేదని అన్నారని, ముగించారు. 

అంతే..మరి ఈ పాటి దానికి, కీలక విషయం, హడావుడి ఎందుకో? ఇంతకీ ఇప్పుడు మంచు లక్ష్మి బిజీగా వున్నది స్వంత సినిమా అనే కాదుట..తమ్ముడు మనోజ్ పెళ్లి హడావుడిలో యావత్తు మంచు కుటుంబమే తలమునకలై వుందట.  అదీ సంగతి.