మనలోని బలాన్నీ బలహీనతలనూ సరిగ్గా గుర్తించగలిగితే అహానికి తావు ఉండదని పెద్దలు చెబుతారు. మనల్ని చూసి నవ్వుతున్న కామెంట్ చేస్తున్నా ఖచ్చితంగా మనలో ఏదో బలహీనత ఉన్నట్లే లెక్క.తన మీద వస్తున్న జోకుల గురించి నేనేమీ బాధపడనని యువరత్న బాలకృష్ణ అంటున్నారు.
నా మీద వస్తున్న జోకులు గానీ, ఇతరత్రా కామెంట్స్ గానీ మీకు సంతోషం పంచితే నాకూ ఆనందమే అంటున్నాడు బాలయ్య బాబు. గతంలో సర్దార్జీ జోక్స్ అని వచ్చేవి. ఇప్పుడు బాలకృష్ణ జోక్స్ అంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఆయన మీద జోక్స్ రావడం గురించి చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటున్నారాయన.
బాలకృష్ణ స్టేషనరీ షాప్‌కెళ్లి వైట్ పేపర్స్ అడుగుతాడు. సార్ ఒక్క పేపరే ఉంది సార్.. సారీ అంటాడు షాపు వాడు. ఫర్వాలేదు ఇవ్వండి నేను బయటకెళ్లి ఇంకో పది జిరాక్స్ తీయించుకుంటాను అంటాడు బాలకృష్ణ. ఇలాంటి జోక్స్ ఫేస్ బుక్‌లోనే కాకుండా గూగుల్‌లో ప్రత్యేక పేజీలు కూడా ఉన్నాయి.
ఒక్క బాలయ్య బాబు మీదే కాదు. సూపర్ స్టార్ రజనీ కాంత్ మీదయితే లెక్కలేనన్ని సెటైర్స్ ఉంటాయి. ఇలాంటివి పట్టించుకోవడం అవివేకం అవుతుంది. ఇప్పుడు దేవుళ్ల మీదే జోకులు వేసుకుని ఆనందిస్తున్నారు. సినిమా నటుల గురించి ఇంకా ఎక్కువ చెప్పుకుంటున్నారు. నా కారణంగా వినోదం పండాలి. మేలు జరగాలి ఇవే నేను కోరుకుంటానంటున్నాడు బాలయ్య బాబు.