నందమూరి కళ్యాణ్ రామ్ ‘పటాస్’ చిత్రం ఫస్ట్ షోకే సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుని… దానిని సస్టెయిన్ చేయగలిగింది. ఇటీవలి కాలంలో ఏ సినిమాకీ ఇలా పూర్తిగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు. మార్కెట్లో హిట్ సినిమా లేని టైమ్‌లో రావడం, లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ‘పటాస్’ పండగ చేసుకుంది. ఇప్పటికే కొంతమంది బయ్యర్లు లాభాల్లోకి ప్రవేశించారని ట్రేడ్ రిపోర్ట్.
ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడికి తక్కువలో తక్కువ రూపాయికి రూపాయి లాభం రావడం ఖాయమని అంటున్నారు. ఈ ఏడాదికి ఫస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా ‘పటాస్’ నిలిచింది. ఈ చిత్రానికి మరో కలిసొచ్చే అంశం ఏంటంటే.. ఈ శుక్రవారం దీనికి పోటీనిచ్చే సినిమా ఏదీ రిలీజ్ అవడం లేదు.
‘టెంపర్’ వచ్చే వరకు ‘పటాస్’ని ఛాలెంజ్ చేసే మరో మాస్ మూవీ ఏదీ కనిపించడం లేదు. అంటే మరో రెండు వారాల పాటు గ్రౌండ్ ఖాళీగా ఉందన్నమాట. దీనిని ‘పటాస్’ కరెక్ట్‌గా వాడుకుంటే… చాలా పెద్ద రేంజ్‌కి వెళ్లడం ఖాయం.