నాగార్జున అప్పటి వరకూ చేసిన పాత్రలు ఒక యెత్తు. అన్నమయ్య మరో ఎత్తు. కుటుంబ ప్రేక్షకులతో విడదీయరాని అనుబంధాన్ని అందించింది అన్నమయ్య. ఆ తరవాత రామదాసు, శిరిడీసాయి అంటూ ప్రేక్షకుల్ని ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తాడు. ఈసారీ రాఘవేంద్రరావు – నాగార్జున కలయికలో ఓ భక్తిరస చిత్రం రాబోతోందని తెలిసింది.
కొన్ని రోజుల క్రితం నాగార్జునను జీసెస్‌గా చూపిస్తారని ఓ ప్రచారం సాగింది. అయితే అది జీసెస్ పాత్ర కాదట. శ్రీవేంకటేశ్వర స్వామి పాత్ర అట. ఏడుకొండల వాడికి భక్తుడిగా కనిపించిన నాగ్.. ఇప్పుడు సాక్షాత్తూ ఏడు కొండలవాడి పాత్రలో కనిపిస్తాడన్నమాట. ప్రస్తుతం రాఘవేంద్రరావు స్ర్కిప్టు రూపొందించే పనిలో ఉన్నారని తెలిసింది. అయితే… నాగ్ ఈ పాత్రకు ఒప్పుకొంటాడా, లేదా? అనేది కాస్త డౌటు.
ఎందుకంటే.. నాగ్ ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ బాట పట్టాడు. శిరిడీ సాయి తరవాత ఆ తరహా ప్రయోగాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది. నాగ్ కూడా హాయిగా వెంకీ బాటలో మల్టీస్టారర్ చిత్రాలకు, కమర్షియల్ సినిమావైపూ మొగ్గు చూపుతున్న తరుణంలో తిరుమల దేవుడిగా కనిపిస్తాడంటా..? ఒప్పించే బాధ్యత మాత్రం.. రాఘవేంద్రుడిదే.