ఎవరి విడుదల వారిది

టెంపర్ సినిమా ఆడియో ఫంక్షన్ 28న ప్లాన్ చేసారు. భారీగా, అట్టహాసంగా చేయాలనుకుంటున్నారు. ఈలోగా నిర్మాత బండ్ల గణేష్ తన విడదల తాను కానిచ్చేసారు. ఆయనకు దైవ భక్తి ఎక్కువ. సెంటిమెంట్లు అంతకన్నా ఎక్కువ. …

టెంపర్ సినిమా ఆడియో ఫంక్షన్ 28న ప్లాన్ చేసారు. భారీగా, అట్టహాసంగా చేయాలనుకుంటున్నారు. ఈలోగా నిర్మాత బండ్ల గణేష్ తన విడదల తాను కానిచ్చేసారు. ఆయనకు దైవ భక్తి ఎక్కువ. సెంటిమెంట్లు అంతకన్నా ఎక్కువ. 

అందుకే తన కుటుంబం ఎక్కువగా నమ్మే ఓ శివాలయంలో ఈ ఉదయం టెంపర్ సిడి తీసుకెళ్లి పూజలు జరిపించారు. ఆ విధంగా పుణ్య తిథి అయిన రథసప్తమి నాడు ఆడియో విడుదల అయిందనిపించేసారు. పైగా 28 వ తేదీ నవమి అయింది. అంత మంచిది కాదని భావించినట్లున్నారు. 

అందుకే ఈ రోజు ఆయన ఆడియో విడుదల ఆయన కానిచ్చేసారు. 28న అభిమాన జనం కోసం అసలైన ఆడియో విడుదల భారీగా కానిచ్చేస్తారు.