పూరి-ప్రభాస్ బుజ్జిగాడు సినిమా తో మెరుపులా మెరిసి మాయమైంది సంజన. అన్ని భాషల్లో కలిసి అరడజను సినిమాల వరకు చేతిలో వున్నాయి కానీ, పారితోషికం రేంజ్ మాత్రం ఇంకా పాతిక లక్షలరేంజ్ లోనే వుంది. అలాంటి అమ్మడు ఈ మధ్య బోలెడు డబ్బు పెట్టి భారీ బంగ్లా కొన్నదట. సుమారు పది పన్నెండు కోట్లు.
పైగా మరో ఒకటి రెండు కోట్ల ఖర్చుతో దానికి అదనపు సొగసులు కూడా. గట్టిగా ముఫై సినిమాల వరకు చేసి వుంటుంది. అది కూడా కన్నడంలోనే ఎక్కువ. అక్కడ పారితోషికాలు తక్కువ. మన దగ్గర కూడా ఊరు పేరు తెలియని సినిమాలు. అందువల్ల అక్కడ వచ్చిందీ తక్కువ. అందుకే ఇంత డబ్బు ఎక్కడిదబ్బా అని ఆశ్చర్యపోతున్నారట తెలిసిన జనం.
నిజమో అబద్ధమో తెలియదు కానీ, చక్కర్లు కొడుతున్న రూమర్ ఏమిటంటే, అమ్మగారికి మాంచి సౌండ్ పార్టీ అయిన బిల్డర్ బాయ్ ఫ్రెండ్ వున్నారని, ఇద్దరూ డేటింగ్ లో బిజీగావున్నారని, ఇదంతా ఆయన మహత్యమని. ఎంతవరకు నిజమో సంజనకే తెలియాలి మరి.