సిక్కోలు సెంటిమెంట్ ని నమ్ముకున్న బాబు…?

టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రా జిల్లాల పర్యటనకు వచ్చి చాలా కాలం అయింది. గత ఏడాది లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా ఆయన విశాఖ దాకా వచ్చారు. నాటి నుంచి మళ్లీ టీడీపీ ప్రెసిడెంట్…

టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రా జిల్లాల పర్యటనకు వచ్చి చాలా కాలం అయింది. గత ఏడాది లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా ఆయన విశాఖ దాకా వచ్చారు. నాటి నుంచి మళ్లీ టీడీపీ ప్రెసిడెంట్ ఈ వైపుగా చూడలేదు. ఇక మంచి రోజు చూసుకుని ఉత్తరాంధ్రా నుంచి బాబు టూర్లు స్టార్ట్ చేస్తారు అని ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు.

ఇక చంద్రబాబు కూడా ఏ మాత్రం లేట్ చేయకూడదన్న ఉద్దేశ్యంతో ఉత్తరాంధ్రా జిల్లాల వైపుగా వస్తున్నారు. అందునా టీడీపీకి రాజకీయంగా సెంటిమెంట్ అయిన శ్రీకాకుళం జిల్లాలో ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా బాబు వైసీపీ మీద పోరాటానికి సై అనబోతున్నారు.

ఏపీలో వివిధ రకాలైన పన్నులు, వివిధ రకాల చార్జీల మోత మీద టీడీపీ బాదుడే బాదుడు అంటూ ఒక నిరసనకు ప్లాన్ చేసింది. అది అన్ని జిల్లాల్లో కొన‌సాగుతోంది. ఇక చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస రానున్నారు. ఈ నియోజకవర్గం స్పీకర్ తమ్మినేని సీతారామ్ ది.

ఇక్కడ ఆయన మేనల్లుడు కూన రవికుమారే టీడీపీ తరఫున ప్రత్యర్ధి. అంతే కాదు ఆయనే శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్. మొత్తానికి బాబు వస్తూనే తమ్మినేని ఇలాకాలోనే కాలు మోపనున్నారు. 

మరి సిక్కోలు నుంచి ఆయన ఏం మాట్లాడుతారు అన్నది ఒక ఆసక్తి అయితే ఈ జిల్లా సెంటిమెంట్ ఏమైనా కలసివస్తుందా అన్నది మరో ఉత్కంఠ.