చిరు సినిమాల్లో మార్పుల్లేవట

ఆచార్య సినిమా ఫలితం తేడా కొట్టడంతో రకరకాల గ్యాసిప్ లు స్టార్ట్ అయిపోయాయి. కొరటాల-ఎన్టీఆర్ సినిమా మీద, చిరంజీవి తరువాత సినిమాల మీద. బాబి డైరక్షన్ లో మెగాస్టార్ చేస్తున్న వాల్తేర్ వీరయ్య (వర్కింగ్…

ఆచార్య సినిమా ఫలితం తేడా కొట్టడంతో రకరకాల గ్యాసిప్ లు స్టార్ట్ అయిపోయాయి. కొరటాల-ఎన్టీఆర్ సినిమా మీద, చిరంజీవి తరువాత సినిమాల మీద. బాబి డైరక్షన్ లో మెగాస్టార్ చేస్తున్న వాల్తేర్ వీరయ్య (వర్కింగ్ టైటిల్) సినిమాలో రవితేజ‌ కీలకపాత్ర చేస్తున్నారు. 

ఇప్పుడు ఆయన వెనక్కు వెళ్లారంటూ గ్యాసిప్ లు మొదలయ్యాయి. వాల్తేర్ వీరయ్య సినిమా మీద దర్శకుడు బాబి టీమ్ గట్టిగా వర్క్ చేస్తోంది. బాబికి సన్నిహితులైన మరి కొందరు రైటర్లు కూడా దాని మీద వర్క్ చెేస్తున్నారు. 

కోన వెంకట్ వారిలో ఒకరు. ఈ సబ్ఙెక్ట్ మీద చిరంజీవి చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు. ఇది రీమేక్ కాదు. ఒరిజినల్ సబ్జెక్ట్ నే. కానీ అలాంటిది ఏమీ లేదని, ఈ ఇద్దరి కాంబినేషన్ లో షెడ్యూలు త్వరలో ప్రారంభం అవుతుందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. 

అలాగే కొరటాల-ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమాలో కూడా ఏ మార్పులు లేవని, కథ, కథనాల విషయంలో ఎలాంటి మార్పులు లేవని డైరక్టర్ సన్నిహితవర్గాలు తెలిపాయి.