నందమూరి కళ్యాణ్‌రామ్‌కి కష్టపడతాడనే పేరుంది. కానీ పాపం ఎంత కష్టపడ్డా కానీ అతను కోరుకున్న ఫలితాలు రాలేదు. అయితే నిరాశ పడిపోకుండా మంచి కథ కోసం వేచి చూసి… పటాస్ సినిమాని స్వీయ నిర్మాణంలో చేసాడు. ఫైనల్‌గా అతడి కష్టం ఫలించింది. ఈ చిత్రం హిట్ టాక్‌తో నడుస్తోంది.
ఎక్కడా బాలేదు… యావరేజ్‌గా ఉందనే మాట కూడా వినిపించడం లేదు. యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు కోట్ల షేర్ సాధించింది. రెండో రోజు కూడా కలెక్షన్లు సూపర్ స్ట్రాంగ్‌గా ఉన్నాయని రిపోర్ట్స్ వచ్చాయి. ఆదివారం, రిపబ్లిక్ డే అయిన సోమవారం కూడా కలెక్షన్లకి ఢోకా ఉండదు.
తొమ్మిది కోట్ల రూపాయలకి అమ్మిన ఈ చిత్రం మొదటి వారం తిరిగే లోగా బయ్యర్ల పెట్టుబడిని కూడా తిరిగి రాబట్టేస్తుందట. మొత్తానికి ఎన్నో నష్టాలు చవిచూసిన కళ్యాణ్‌రామ్ కష్టాలు తీరిపోతున్నాయి. తన బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘కిక్ 2’కి కూడా బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతోంది. ఇక ఎన్టీఆర్‌తో చేద్దామని ప్లాన్ చేస్తోన్న సినిమాని కూడా పట్టాలెక్కించేస్తే సరి.