ప్రేమకథలపై బన్నీ చూపు

తన సినిమాలన్నీ వైవిధ్యంగా వుండేలా చూసుకోవడం బన్నీ స్టయిల్. అయితే మంచి ప్రేమ కథ చేయాలని అతగాడికి మహా కోరిక. ఇద్దరమ్మాయిలతో ఆ కోరిక అరకొరగానే తీరింది. అందుకే ఇప్పుడు మరో మాంచి ప్రేమకథ…

తన సినిమాలన్నీ వైవిధ్యంగా వుండేలా చూసుకోవడం బన్నీ స్టయిల్. అయితే మంచి ప్రేమ కథ చేయాలని అతగాడికి మహా కోరిక. ఇద్దరమ్మాయిలతో ఆ కోరిక అరకొరగానే తీరింది. అందుకే ఇప్పుడు మరో మాంచి ప్రేమకథ కోసం చూస్తున్నాడు. 

తమ్ముడు శిరీష్ నటించిన కొత్తజంట సినిమాను బన్నీ ప్రత్యేకంగా చూసాడు. చాలా బాగా వచ్చిందంటూ దర్శకుడు మారుతిని అభినందించాడు. అప్పుడే మాంచి ప్రేమకథ వుంటే చెప్పు అని హింట్ ఇచ్చేసాడు. మారుతి చుట్టూ ఎన్ని వివాదాలు ముసురుతున్నా, నిర్మాతలకు కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. సుమారు ఆరు కోట్ల బడ్జెట్ తో, శిరీష్ రెండో సినిమాగా తీసినా కూడా, టేబుల్ ప్రాఫిట్ తీసుకురావడం విశేషం.

 అందుకే నితిన్ సినిమాకు నిర్మాత రెడీ అయిపోయారు. మరే సినిమాలు చేసినా నిర్మాతలు రెడీ అంటున్నారు. ముఫై నలభై కోట్లు ఖర్చు చేసి టెన్షన్ పడే బదులు రెండు మూడు కోట్లు ఖర్చు చేసి, కాస్తో కూస్తో లాభాలు చేసుకోవడం బెటర్ అనుకుంటున్నారు.