ఫిబ్రవరిలో బాహుబలి ట్రయిలర్

ప్రభాస్ అభిమానుల‌కు, బాహుబ‌లి గురించి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినీ ప్రేమికుల‌కు గుడ్ న్యూస్‌. త్వర‌లోనే బాహుబ‌లి ట్రైట‌ర్ రాబోతోంది. దాదాపు రెండు నిమిషాలుండే ఈ ట్రైట‌ర్‌ని రాజ‌మౌళి ప్రభాస్ అభిమానుల‌కు అందించ‌బోతున్నారు.  ఫిబ్రవ‌రి మొద‌టి…

ప్రభాస్ అభిమానుల‌కు, బాహుబ‌లి గురించి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినీ ప్రేమికుల‌కు గుడ్ న్యూస్‌. త్వర‌లోనే బాహుబ‌లి ట్రైట‌ర్ రాబోతోంది. దాదాపు రెండు నిమిషాలుండే ఈ ట్రైట‌ర్‌ని రాజ‌మౌళి ప్రభాస్ అభిమానుల‌కు అందించ‌బోతున్నారు.  ఫిబ్రవ‌రి మొద‌టి వారంలో ఈ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం భావిస్తోంది. 

బాహుబ‌లి క‌థేంటి? ఎలా ఉండ‌బోతోంది?  వెండి తెర‌పై బాహుబ‌లిగా ప్రభాస్ ఎప్పీరియ‌న్స్ ఎలా ఉంటుంది? అనే ఆస‌క్తి, అంచ‌నాలు.. నెల‌కొన్న నేప‌థ్యంలో మ‌రీ ఎక్కువ కాలం ఊరించ‌డం, బాహుబ‌లి కోసం ఎదురుచూసేలా చేయ‌డం రాజ‌మౌళికి ఇబ్బందిగానే తోస్తోంది. అందుకే.. మ‌రీ అంచ‌నాలు పెరిగిపోకుండా ముందు జాగ్రత్తగా ఓ ప్రచార చిత్రాన్ని బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని రాజ‌మౌళి భావించాడ‌ట‌. 

తొలి భాగానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తయింది. అందుకే ఇప్పుడు ట్రైల‌ర్ మేకింగ్‌పై దృష్టి పెట్టాడు జ‌క్కన్న‌. బాహుబ‌లి మేకింగ్ వీడియోల‌నే ప్రసాదం భావించి తెగ చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌… ట్రైల‌ర్‌ని ఏ స్థాయిలో చూస్తారో..