‘సోగ్గాడే చిన్నినాయనా’ అంటూ నాగార్జున ద్విపాత్రాభినయంతో కొత్త దర్శకుడు కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో పాపులర్ టీవీ యాంకర్ అనసూయ ఒక కీలక పాత్ర పోషించనుందని సమాచారం. ఇందులో నాగార్జునకి ఒక మరదలి పాత్ర ఉందట. ఆ క్యారెక్టర్‌కి ఎవరు బాగుంటారా అని ఆలోచించి అనసూయని తీసుకున్నారట.
ఈమధ్యే సినీ రంగ ప్రవేశం చేసిన అనసూయకి ఇది చాలా పెద్ద బ్రేకే. నాగార్జునలాంటి అగ్ర నటుడితో చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చినా గుర్తింపు బాగుంటుంది. ఇందులో నాగ్, అనసూయలపై పాట కూడా ఉంటుందట. సినిమాల్లో కూడా టీవీలో అయినంత పాపులర్ అయిపోవాలని చూస్తోన్న అనసూయకి ఇంతకంటే ఏం కావాలి.
నాగార్జున సరసన లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ కథానాయికలుగా నటిస్తోన్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. భాయ్ తర్వాత సోలో హీరోగా నటించనని చెప్పిన నాగార్జున ఈ కథ తనకి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసేసాడు.