సెక్సీ బ్యూటీ డబుల్‌ కిక్‌!

రవితేజతో కిక్‌ 2లో నటిస్తూ, ఎన్టీఆర్‌ తదుపరి చిత్రంలో ఛాన్స్‌ కొట్టేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెక్స్‌ట్‌ నంబర్‌వన్‌ హీరోయిన్‌ అయిపోతుందని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, లౌక్యం…

రవితేజతో కిక్‌ 2లో నటిస్తూ, ఎన్టీఆర్‌ తదుపరి చిత్రంలో ఛాన్స్‌ కొట్టేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెక్స్‌ట్‌ నంబర్‌వన్‌ హీరోయిన్‌ అయిపోతుందని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, లౌక్యం సినిమాలతో వచ్చిన విజయాలతో రకుల్‌ కుర్రాళ్లకి హాట్‌ ఫేవరెట్‌గా మారింది. 

గ్లామర్‌తో పాటు టాలెంట్‌ కూడా ఉన్న ఈ సెక్సీ సుందరికి లక్‌ కూడా కలిసొచ్చేసింది. అందుకే సమంత, తమన్నాలాంటి వాళ్లు ఏలుతోన్న టైమ్‌లో వచ్చి కూడా పాతుకుపోయింది. అన్నట్టు రవితేజ సరసన రకుల్‌ నటిస్తున్న కిక్‌ 2 చిత్రంలో ఆమె డ్యూయల్‌ రోల్‌ చేస్తుందట. పల్లెటూరి అమ్మాయిగా, సిటీ యువతిగా రెండు రకాలుగా కనిపిస్తుందట. 

ఇది నిజంగా డ్యూయల్‌ రోలా లేక రెండు షేడ్స్‌ ఉన్న క్యారెక్టరా అనేది సస్పెన్స్‌గా ఉంచుతున్నారు. ఈ చిత్రానికి రకుల్‌ కూడా వన్‌ ఆఫ్‌ ది హైలైట్స్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఆమె క్యారెక్టర్‌ని సురేందర్‌ రెడ్డి చాలా కొత్తగా తీర్చిదిద్దాడట. అతనొక్కడే, ఊసరవెల్లి, రేసుగుర్రం… తదితర చిత్రాల్లో హీరోయిన్‌ పాత్రకి కూడా సురేందర్‌ ఎంత ఇంపార్టెన్స్‌ ఇచ్చాడనేది తెలిసిందే.