ఎన్నాళ్ళని కడుపు మాడ్చుకుని గ్లామర్‌గా కనిపించాలి? ఎంత డబ్బు వుండి ఏం లాభం.? కోరుకున్నది తినకపోతే.. ఇంకేం జీవితం చెప్పండి. అందుకే తమన్నా గ్లామర్ సంగతిని పక్కన పెట్టి, కడుపు నిండా తినేసి తన సంతృప్తిని అనుభవిస్తుందట.
అందుకే నాజూగ్గా కనిపించే తమన్నా ఇప్పుడు కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపిస్తుంది. ఏదన్నా సినిమా కోసం కాస్త లావయ్యిందా? అని ఆరా తీస్తే, అదేం లేదు.. కోరుకున్నఫ్పుడే తినేసి, కంటి నిండా నిద్రపోతుందట. పైగా షూటింగ్స్ హడావిడిలో ఎక్సర్సైజులు కూడా మానేసిందట. దాంతో తమన్నా ఒంట్లో మార్పులు స్పష్టంగా కనిపించేస్తున్నాయి.
తన టార్గెట్‌ని చేరుకోవడానికి ఇంతకాలం.. తన ఒంటినీ, కడుపునీ మాడ్చుకున్న తమన్నా ఇక జీవితాన్ని ఎంజాయ్ చేసే పనిలో పడినట్లే కనిపిస్తుంది. బాగా సుఖపడిపోతున్నప్పుడే శరీరంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఇప్పుడు తమన్నా గతంలో కన్నా కొత్తగా కనిపిస్తుంది. గమనించి చూస్తే ఆ తేడాని అందరూ చూడొచ్చు మరి.