ఊహించని విధంగా సర్కారువారి పాట సినిమాకు సంబంధించి ఓ లిరికల్ వీడియోలో మహేష్ కూతురు సితార మెరిసింది. పెప్పీ సాంగ్ కు స్టెప్పులేసి అదరగొట్టింది. ఇంతకీ ఈ ఆలోచన ఎవరిది? సితారతో డాన్స్ చేయించాలని ముందుగా అనుకున్నది ఎవరు? ఆ క్రెడిట్ పూర్తిగా తనకే దక్కుతుందంటున్నాడు తమన్.
“సితార ఇనస్టా వీడియోస్ చూస్తుంటాను. ఆమెలో ఏదో గ్రేస్ ఉంది. అందుకే పెన్నీ సాంగ్ కు తీసుకోవాలనుకున్నాను. నా ఆలోచనను సితారకు చెప్పాను. ఆమె చాలా ఎక్సయిట్ అయ్యారు. ఇద్దరం వెళ్లి మహేష్ కు చెప్పాం. మహేష్ ముందు ఒప్పుకోలేదు. నేను ప్రజెంటేషన్ చూపించాను. అది చూసిన తర్వాత ఒప్పుకున్నారు. అలా పెన్నీ సాంగ్ లోకి సితార వచ్చింది.”
సితార రావడంతో పెన్నీ సాంగ్ రేంజ్ పెరిగిందంటున్నాడు తమన్. మధ్యాహ్నం సెట్స్ పైకొచ్చి సాయంత్రం 5 గంటలకు సితార షూటింగ్ మొత్తం పూర్తిచేసిందని, చాలా యాక్టివ్ గా చేసిందని మెచ్చుకున్నాడు. సితారకు కెమెరా భయం, స్టేజ్ ఫియర్ లేవని.. భవిష్యత్తులో సోలోగా సింగిల్స్ రిలీజ్ చేసే సత్తా ఆమెకు ఉందంటున్నాడు.
మహేష్ హీరోగా నటిస్తున్న సర్కారువారి పాట సినిమాకు సంబంధించి ఈరోజు సాయంత్రం 4 గంటలకు ట్రయిలర్ రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా 'ట్రయిలర్ షాట్స్' పేరిట ముందుగానే మహేష్ ఉన్న కొన్ని క్లిప్పింగ్స్, స్టిల్స్ విడుదల చేస్తున్నారు. దీంతో నిన్నట్నుంచి సోషల్ మీడియాలో సర్కారువారి పాట హంగామానే నడుస్తోంది.