హిందీ సినిమాల్తో పోలిస్తే తెలుగు సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చాలా అరుదు. ఈమధ్యే తెలుగు సినిమాల్లోను వీటి సంఖ్య పెరుగుతోంది. లిప్ లాక్ సీన్స్ చేయడంలో స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ముందుండే వాడు. ఒకానొక టైమ్‌లో అతని సినిమాలన్నిట్లోను లిప్ లాక్స్ ఉండేవి. అయితే ఈమధ్య బన్నీ అలాంటి సీన్లు తగ్గించేసాడు.
పెళ్లయిన తర్వాత ఆన్‌స్క్రీన్ రొమాన్స్ డోస్ తగ్గించేసావా అని అడిగితే… అది కారణం కాదని అసలు సంగతి చెప్పుకొచ్చాడు. తన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో వస్తున్నారని, పిల్లలు తన సినిమాల్ని చూస్తున్నప్పుడు రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేయకూడదని భావించి ఇక తన సినిమాల్లో చుంబన దృశ్యాలు ఉండరాదని నియమం పెట్టుకున్నా అని చెప్పాడు.
లిప్ లాక్ సీన్స్ చేయకుండానే రొమాంటిక్ హీరోగా షారుక్ ఖాన్ ఎంత పేరు తెచ్చుకున్నాడో చూసినప్పుడు ఇక రొమాన్స్ కోసమని లిప్ లాక్ కంపల్సరీ అని అనుకోవడం కరెక్ట్ కాదని వివరించాడు. మన మాస్ ఆడియన్స్ కూడా లిప్ లాక్స్ చూడ్డానికి ఆసక్తి చూపించరని అల్లు అర్జున్ తనకి తెలిసింది చెప్తున్నాడు.