డే అండ్ నైట్ కష్టపడుతున్న ఎన్టీఆర్

టెంపర్ సినిమా ఎలాగైనా మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని యూనిట్ కిందా మీదా పడుతోంది. అసలే పూరి జగన్నాధ్ సినిమాను పరుగులతో పూర్తి చేస్తాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తోడయ్యాడు. నిన్న ఉదయం…

టెంపర్ సినిమా ఎలాగైనా మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని యూనిట్ కిందా మీదా పడుతోంది. అసలే పూరి జగన్నాధ్ సినిమాను పరుగులతో పూర్తి చేస్తాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తోడయ్యాడు. నిన్న ఉదయం నుంచి ఈ ఉదయం వరకు కంటిన్యూగా వర్క్ చేసి ఓ ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేసేసేడట. 

క్లయిమాక్స్, ఓ సాంగ్ పెండింగ్ వుందని తెలుస్తోంది. ఇరవై నాలుగు, ఇరవై అయిదు నాటికి ఎలాగైనా గుమ్మడికాయ కొట్టేయాలని కిందా మీదా పడుతున్నారు. మరో పక్క పోస్టు ప్రొడక్షన్ పని సమాంతరంగా కానిచ్చేస్తున్నారు. సినిమా అయిదు లేదు ఆరున విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే 13న అని కూడా టాక్ వుంది. వరల్డ్ కప్ ప్రభావం లేకుండా అయిదు, ఆరుల్లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారట. 

అవసరం అయితే ఒకరి రెండు రోజులు ఆలస్యంగానైనా అడియో ఫంక్షన్ చేయచ్చని, సినిమా ముందు పూర్తి చేయాలని పూరి-ఎన్టీఆర్ భావిస్తున్నారట. అందుకే 25న అడియో ఫంక్షన్ వుంటుందా, వుండదా అన్నది ఇంకా అనుమానంగా వుంది. ఇప్పటికే మంచి పండుగ సీజన్ ను మిస్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ను వదిలేసుకుంటే, సినిమా బిజినెస్ టార్గెట్ రీచ్ కావడం కష్టమే అవుతుంది.