ఇప్పుడు అమ్మ, అత్త పాత్రలకు కూడా గ్లామర్ అంటింది. అమ్మ అంటే అంజలీదేవి, ఆంటీ అంటే పండరీ బాయి అనే కాలం కాదు. నగ్మా, రమ్యకృష్ణ చేసేసారు. ఇప్పుడు ఇంకా కాస్త చిన్న వయసు అమ్మలు, అత్తలు కావాలి. అందుకే అత్తారింటికి దారేది, మిర్చి, దృశ్యం సినిమాల్లో నదియా అదరగొట్టేయగలిగింది.
మహేష్ బాబు-కొరటాల శివ సినిమాలో అలాంటి క్యారెక్టర్ ఒకటి వుంది. శ్రీదేవిని ట్రయ్ చేద్దామని అనుకున్నారు మరి ఏమయిందో తెలియదు. ఆఖరికి గ్రేసీ సింగ్ ను ఓకే చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
గ్రేసీ సింగ్ తెలుగవారికి పరిచయమే. నాగ్ తో సంతోషం, మోహన్ బాబుతో తప్పుచేసి పప్పు కూడు సినిమాలు చేసింది. అసలు ఆమె వుండడమే మిడిల్ ఏజ్ ముదితలా వుంటుంది. అందువల్ల ఇప్పుడైతే మహేష్ మదర్ గా జగపతిబాబు సరసన వైఫ్ గా సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట.