మహేష్‌బాబుకి ఫుల్‌ ప్యాడింగ్‌

మహేష్‌బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు’లో పేరున్న ఆర్టిస్టులు చాలా మంది నటిస్తున్నారు. సాధారణంగా పెద్ద హీరో ఉన్న సినిమాల్లో ప్యాడింగ్‌ ఆర్టిస్టుల కోసం అంతగా ఖర్చు పెట్టరు. పేరున్న విలన్‌, హీరోయిన్‌ మినహా మిగతా…

మహేష్‌బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు’లో పేరున్న ఆర్టిస్టులు చాలా మంది నటిస్తున్నారు. సాధారణంగా పెద్ద హీరో ఉన్న సినిమాల్లో ప్యాడింగ్‌ ఆర్టిస్టుల కోసం అంతగా ఖర్చు పెట్టరు. పేరున్న విలన్‌, హీరోయిన్‌ మినహా మిగతా ప్యాడింగ్‌ ఉండాలని దర్శకులు కూడా పట్టుబట్టరు. కానీ కొరటాల శివ మాత్రం తన సినిమాలో ప్రతి పాత్రకీ పేరున్న వారినే ఎంచుకుంటున్నాడు. 

ఆల్రెడీ ఇందులో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో నదియా నటిస్తోంది. ఇప్పుడు మహేష్‌బాబు తల్లి పాత్రకి గ్రేసీ సింగ్‌ని ఎంపిక చేసారు. ‘సంతోషం’ సినిమాలో నాగార్జునకి జోడీగా నటించిన గ్రేసీసింగ్‌ బాలీవుడ్‌లో లగాన్‌లాంటి చిత్రాల్లో నటించింది. తల్లి పాత్రకి సుధనో, పవిత్రనో కాకుండా గ్రేసీ సింగ్‌ని తీసుకున్నారు. 

అలాగే మిగిలిన అన్ని పాత్రలకి కూడా ప్రాజెక్ట్‌కి క్రేజ్‌ తెచ్చే వారినే ఏరి కోరి సెలక్ట్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ బేస్‌ చేసుకుని సాగే మాస్‌ ఎంటర్‌టైనర్‌ అయిన ఈ చిత్రంలో మహేష్‌ సరసన శృతి నటిస్తోంది. దీనిని లేట్‌ సమ్మర్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేసుకుంటున్నారు.