చెర్రీకి ఓ ఐటెమ్ గాళ్ కావలెను

బ‌డా హీరోల సినిమాలో ఏం ఉన్నా లేకున్నా.. ఐటెమ్ హంగామా మాత్రం ఉండాల్సిందే. మ‌సాలా పాట ప‌డితే గానీ సినిమా పూర్తవ్వదు. ఆ పాట‌లో ఏ బాలీవుడ్ హీరోయినో క‌నిపిస్తే కిక్కే కిక్కు. రామ్‌చ‌ర‌ణ్…

బ‌డా హీరోల సినిమాలో ఏం ఉన్నా లేకున్నా.. ఐటెమ్ హంగామా మాత్రం ఉండాల్సిందే. మ‌సాలా పాట ప‌డితే గానీ సినిమా పూర్తవ్వదు. ఆ పాట‌లో ఏ బాలీవుడ్ హీరోయినో క‌నిపిస్తే కిక్కే కిక్కు. రామ్‌చ‌ర‌ణ్ సినిమాలోనూ ఇప్పుడు ఓ ఐటెమ్ గాళ్ కావాలి. 

చెర్రీ – శ్రీ‌నువైట్ల క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపొందుతోంది. మాస్, యాక్షన్ అంశాల‌తో రూపొందుతున్న సినిమా ఇది. క‌థానాయిక‌గా సమంత దాదాపు క‌న్‌ఫామ్ అయ్యింది. ఇప్పుడు ఐటెమ్ గాళ్ ని వెదికి ప‌ట్టుకోవ‌డం బాకీ. ఆ పాట‌లో మెరుపులా దూసుకుకొచ్చే పాప కోసం చిత్రబృందం అన్వేష‌ణ సాగిస్తోంది. 

బాలీవుడ్ టాప్ హీరోయిన్లుగా చ‌లామ‌ణీ అవుతున్న సోన‌మ్ క‌పూర్‌, సోనాక్షిసిన్హాల పేర్లు ఈ పాట కోసం ప‌రిశీల‌న‌లో ఉన్నట్టు తెలుస్తోంది. బుల్లితెర‌పై  హాట్ భామగా పేరు తెచ్చుకొన్న ఓ యాంక‌ర్ పాప పేరు కూడా లిస్టులో ఉంద‌ట‌. మ‌రి.. ఆ ల‌క్కీ ఛాన్స్ ఎవ‌రిదో