అల్లు అర్జున్ జాదూగర్?

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా టైటిల్ అంటే కచ్చితంగా డిఫరెంట్ గా వుంటుంది. జల్సా, ఖలేజా,జులాయి ఇలా..ఆయన ఎంత తెలుగు అద్భుతంగా రాయగల రచయిత అయినా టైటిళ్లు మాత్రం ఇలాగే వుంటాయి.  Advertisement ఇప్పుడు అల్లు…

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా టైటిల్ అంటే కచ్చితంగా డిఫరెంట్ గా వుంటుంది. జల్సా, ఖలేజా,జులాయి ఇలా..ఆయన ఎంత తెలుగు అద్భుతంగా రాయగల రచయిత అయినా టైటిళ్లు మాత్రం ఇలాగే వుంటాయి. 

ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాకు కూడా ఇలాంటి టైటిల్ కోసం అన్వేషణ, ఆలోచన సాగుతున్నాయట. ముందు త్రిశూలం అన్న టైటిల్ వినిపించింది కానీ అది ఏదో అటు క్లాస్,  ఇటు మాస్ కాని టైటిల్ లా వుందన్న అభిప్రాయాలు వినవచ్చాయట. దాంతో సరైన టైటిల్ కోసం ఆలోచిస్తున్నారట. 

జాదూగర్ అన్న టైటిల్ అయితే ఎలా వుంటుంది అన్న డిస్కషన్ జరుగుతున్నట్లు వినికిడి. హుషారు అన్న టైటిల్ కూడా బయటకు వచ్చింది కానీ అది కూడా పెద్ద బాగా లేదని అనుకుంటున్నట్లు, ఆఖరికి జాదూగర్ వైపే ఎక్కువగా మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. అయితే జాదూగర్ అంటే జనాలకు ఎక్కుతుందా, ఇంకేమన్నా అలాంటి టైటిల్ కుదురుతుందా అని చూస్తున్నారట.