చాన్నాళ్ళ క్రితం హీరోయిన్ దివ్యభారతి ప్రమాదవశాత్తూ మృతి చెందింది. అప్పట్లో హత్యగానూ, ఆత్మహత్యగానూ వార్తల్లో కెక్కింది ఆ ఘటన. అప్పటినుంచి ఇప్పటిదాకా దివ్యభారతి ఎలా చనిపోయింది.? అన్న ప్రశ్నకైతే సమాధానం దొరకలేదు. ఇక దొరికే అవకాశమూ లేదు. ఇలా అనుమానాస్పద మరణాల విషయలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పోటీ పడ్తుంటారు. దేనికీ క్లారిటీ దొరకదు. ఎందుకిలా.? ఏమో.. ఎవరికీ ఎప్పటికీ ఆన్సర్ తెలియని ప్రశ్న ఇది.
ఇటీవలి ఘటనల్ని తీసుకుంటే, తెలుగు నాట సినీ సంగీత దర్శకుడు చక్రి మరణం ‘మిస్టరీ’గా మారింది. దేశవ్యాప్తంగా చూస్తే, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మరణం కూడా అనుమానాస్పదమే. రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి చక్రి, సునంద డెత్ మిస్టరీస్. గుండెపోటుతో చక్రి మరణించగా, ఆయన మరణంపై కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదం కారణంగా, అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సునంద పుష్కర్ మరణంపై మొదటినుంచీ అనుమానాలు వ్యక్తమవుతున్నా, తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అప్పట్లో వ్యవహారాన్ని చల్లార్చేశారు మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్. అయితే అదిపడు ఆయన మెడకు చుట్టుకునేలా కన్పిస్తోంది.
చక్రి ఎలా చనిపోయాడు.? ఆయన్ని ఎవరైనా చంపేశారా.? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టే అవకాశముంది. అయితే, చక్రి మరణానికి సంబంధించి ‘మిస్టరీ’ని ఛేదించడం పోలీసులకు చాలా కష్టమైన పని. కారణం చక్రి భౌతిక కాయానికి దహన సంస్కారాలు పూర్తయిపోవడం. శాంపిల్స్ సేకరించడమంటే, అదేమీ అంత తేలిక కాదు. ‘అసాధ్యం’ అన్న అభిప్రాయాలు ఓ పక్క విన్పిస్తుంటే, అసాధ్యమేమీ కాదుగానీ, అత్యంత క్లిష్టమైన వ్యవహారమని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆస్తి తగాదాలే చక్రి మరణం వివాదాస్పదమవడానికి కారణమన్నది ఓపెన్ సీక్రెట్. చక్రి భార్య, చక్రి కుటుంబ సభ్యులు, చక్రి మరణాన్ని అనుమానాస్పదం చేసేశారు. సునంద పుష్కర్ మరణం ఇంకా భిన్నమైన అంశం. మొదటి నుంచీ ఆమె మరణం చుట్టూ అనేక అనుమానాలు. ఆ అనుమానాలే ఇపడు నిజమవుతున్నాయి. ఆమెది సహజ మరణం కాదని తేలిపోయింది. ఎవరు చంపారు? అన్నదే తేలాల్సి వుందిపడు. అనేక అనుమానాలు సునంద భర్త, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ చుట్టూనే తిరుగుతున్నాయి. పోలీసులకీ, శశిథరూర్కీ మధ్య మాటల యుద్ధం జరుగుతోందిపడు. ఈ యుద్ధంలో ఎవరు విజయం సాధిస్తారు.? అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది.
అసలు ప్రముఖుల మరణాలు ఎందుకు వివాదాస్పదమవుతాయి.? అన్న ప్రశ్న సహజంగానే సామాన్యుల్ని వేధిస్తుంటుంది. సమాధానం దొరకని ప్రశ్నేమీ కాదిది. ఎక్కువగా ఆస్తి తగాదాలే వీటిల్లో కీలక భూమిక పోషిస్తుంటాయి. పాపులారిటీని ఉపయోగించుకుని, అనుమానాస్పద మరణాల్ని సైతం, చాకచక్యంగా సహజ మరణాలుగా చిత్రీకరించేసి ‘మమ’ అన్పించేస్తుంటారు కొందరు. ఖర్మ కాలిపోతేనే, తమ ‘ప్రయత్నం’ బెడిసి కొట్టి, తాము వివాదాల్లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది కొందరు ప్రముఖులకు. సునంద పుష్కర్ మరణం విషయంలో శశిథరూర్ అలానే ఇరుక్కుపోతున్నారిపడు.
వ్యవస్థల్ని పలుకుబడితో భ్రష్టు పట్టించేయడం వల్ల ఇలాంటి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి. మానవ సంబంధాల్ని డబ్బు డామినేట్ చేస్తోన్న ప్రస్తుత రుణంలో, హత్యలు చాలా తేలిగ్గా జరుగుతున్నాయి. సహజ మరణాలు హత్యలుగా వార్తల్లో కెక్కుతున్నా, హత్యలు కూడా సహజ మరణాలుగా నీరుగారిపోతున్నా.. అంతా డబ్బు, పలుకుబడి పుణ్యమే. చక్రి మరణం ఎపిసోడ్‌నే తీసుకుంటే, తొలుత డాక్టర్లు అనుమానాస్పద మృతి.. అని ప్రకటించారట. ఆ తర్వాత ఏమయ్యిందో, సహజ మరణం కింద వైద్యులు డిక్లేర్ చేశారనీ, అది కూడా కొందరు పెద్దల సూచనతోనేననీ, తప్పక తాము దాన్ని ఆమోదించాల్సి వచ్చిందని చక్రి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంటే, ఇక్కడ వైద్యుల్ని తప పట్టాల్సి వస్తుందా.? విచారణలో పోలీసులు ఆ కోణంలోనూ ముందడుగు వేసే అవకాశం వుంది.
సమాజానికి మార్గదర్శకులుగా వుండాల్సిన ప్రముఖులు, వారి కుటుంబాలు.. వివిధ కారణాలతో రచ్చెకక్కడంతో, వ్యవస్థలో విలువల పతనానికి పరాకాష్ట.. అనే అభిప్రాయాలు సహజంగానే వెల్లువెత్తుతాయి. ఆయా వ్యక్తులు తాము జీవించి వున్న కాలంలో ఎలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారో, మరణానంతరం కుటుంబ తగాదాల కారణంగా ఆయా వ్యక్తుల ‘విలువ’ అంతగా పతనావస్థకు చేరుకుంటుంది. దురదృష్టవశాత్తూ ఈ విషయాన్ని గుర్తించే స్థితిలో ఆయా వ్యక్తుల కుటుంబాలు వుండటంలేదు.
సునంద పుష్కర్ మరణం ఇప్పుడే ఎందుకు వివాదాస్పదమవుతోంది.? చక్రి డెత్ మిస్టరీలోకి పొలిటికల్ ప్రెజర్స్ ఎలా చొచ్చుకు వస్తున్నాయి.? ఇలా వివిధ కోణాల్లో ఆయా కేసుల్ని విశ్లేషిస్తే మళ్ళీ అందులోంచి కొత్త కొత్త అనుమానాలు పుట్టుకొస్తాయి. చట్టం తన పని తాను చేసుకుపోతున్నా, వాస్తవాలు బయటపడాలన్న రూల్ ఏమీ లేదు. రాజకీయ పెత్తనం మొదలైంది గనుక, పొలిటికల్ అండదండల్ని బట్టి, ఆయా కేసులు ఎలా కొలిక్కి వస్తాయనేది ఆధారపడి వుంటుంది. అంతిమంగా ఈ తరహా డెత్ మిస్టరీలు ఎప్పటికీ ఛేదించబడవేమో.!
వెంకట్ ఆరికట్ల