తెలుగు కథకు హిందీ లుక్ ‘జాట్’

తెలుగు వారికి అలవాటైన కొన్ని సీన్లు కనిపించి రీపీట్ అనిపించవచ్చు. కానీ హిందీ వాళ్లకు కాస్త కొత్తగా వుంటుంది.

బోయపాటి, మలినేని.. బాబీ.. వీళ్లంతా మనవాళ్లోయ్.. బడా హీరో.. భారీ విలన్..హెవీ స్టోరీ.. జాదా స్టార్ కాస్ట్.. రీసౌండింగ్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్.. ఇలాంటి కొన్ని హిట్ ఫార్ములాలతో సినిమాలు తీసే మన దర్శకులు. కథతో పాటే ఆయుధాలు డిజైన్ చేస్తారు. మాటల తూటాలు పేల్చడం ఎలా అన్నది చూస్తారు.

విలన్ ఎంత దారుణంగా చెలరేగిపోతే, హీరో అంత బలంగా మీద పడతాడు. ఎంత రక్తపాతం సృష్టిస్తాడు అన్నది కీలకంగా వుంటుంది. కామన్ ఆడియన్ కు ఆ కష్టాలు చూస్తే బాధగా వుంటుంది. తరువాత హీరో నరుకుడు, చంపుడు, కొట్టుడు చూస్తే ఈల వేయాలనిపిస్తుంది.

సరిగ్గా అలాంటి సినిమాలను హిందీ జనాలకు చూపిస్తే…దర్శకుడు గోపీచంద్ మలినేని అదే చేస్తున్నారు. జాట్ అనే పేరుతో సన్నీ డియోల్ తో సినిమా చేసారు. దాని ట్రయిలర్ వచ్చేసింది. అవుట్ అండ్ అవుట్ బాలయ్య సినిమా మాదిరి. బలహీనులను దారుణంగా అణగదొక్కే విలన్… అతగాడిని అడ్డుకోలేని చట్టం..అప్పుడు రంగంలోకి దిగే హీరో. ట్రయిలర్ లో కనిపించింది ఇది. అయితే లైన్ ఇదే కావచ్చు. ఇక్కడ కారణాలు వేరే వుంటాయి. దానికి అనుగుణంగా కథ వుంటుంది.

ట్రయిలర్ చాలా భారీగా కనిపించింది. ఖర్చు అంతకన్నా గట్టగా కనిపించింది. తెలుగు వారికి అలవాటైన కొన్ని సీన్లు కనిపించి రీపీట్ అనిపించవచ్చు. కానీ హిందీ వాళ్లకు కాస్త కొత్తగా వుంటుంది. థమన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ సీన్లను మరింత లేపింది. మొత్తం మీద మైత్రీ-మలినేని కలిసి హిందీ జనాలకు సరైన తెలుగు సినిమా చూపించబోతున్నారు.

9 Replies to “తెలుగు కథకు హిందీ లుక్ ‘జాట్’”

  1. నీ బొంద .. బాలకృష్ణ వీరసింహ రెడ్డి రీమేకే ఈ హిందీ జాట్ .. కనీసం కొంచెం తెలివి కూడా లేదు.. సన్నాసి కొడకా..

Comments are closed.