వరుణ్ తేజ్.. మేర్లపాక గాంధీ.. ఈ ఇద్దరూ హిట్ కోసం చూస్తున్నారు. ఈ ఇద్దరితో కలిపి హిట్ కొట్టాలి అని రంగంలోకి దిగింది యువి సంస్థ. ఓ మంచి ఎంటర్ టైన్ మెంట్ కథతో రంగంలోకి దిగారు. వైవిధ్యమైన ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఆశించిన మేరకు ఫలితం దక్కడం లేదు.
పాపం, వున్న మాట చెప్పాలి అంటే వరుణ్ ప్రయత్న లోపం లేదు. రొటీన్ సినిమాలు చేయడం లేదు. ప్రతీదీ సమ్ థింగ్ డిఫరెంట్ అనేవే ట్రయ్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఎందుకో ఫలితం మాత్రం అల్లంత దూరంలో వుండిపోతోంది. ఇప్పుడు ఎంటర్ టైన్ మెంట్ జానర్ లోకి వచ్చాడు. అచ్చమైన మేర్లపాక మార్క్.
మేర్లపాక గాంధీ కూడా మంచి దర్శకుడు ఎంటర్ టైన్ మెంట్ జానర్ లో తోపు. కానీ అది వదిలేసి ఏదేదో ట్రయ్ చేస్తూ వస్తున్నాడు. సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇప్పుడు మళ్లీ తన జానర్ లోకి వచ్చి, మంచి కథ తయారుచేసుకున్నాడు. కొరియన్ కనకరాజు అన్నది వర్కింగ్ టైటిల్. ఈ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారని నమ్మకంగా వున్నారు.
ఇటు వరుణ్ కానీ అటు గాంధీ కానీ హర్రర్ కామెడీ సినిమా చేయడం ఇదే తొలిసారి. రితిక నాయక్ కథానాయిక. థమన్ సంగీతం. కాస్త భారీ టెక్నికల్ ప్యాడింగ్ నే వుంది. ఇక మిగిలింది హిట్ కొట్టడమే.
Nice
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,