విచార‌ణ‌కు హాజ‌రైన యాంక‌ర్ శ్యామ‌ల‌

విచార‌ణ ద‌శ‌లో ఉండ‌గా మాట్లాడ్డం మంచిది కాద‌ని సున్నితంగా మీడియా ప్ర‌శ్న‌ల్ని శ్యామ‌ల తిర‌స్క‌రించారు.

బెట్టింగ్‌యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేసిన కేసులో వైసీపీ అధికార ప్ర‌తినిధి, ప్ర‌ముఖ యాంక‌ర్ శ్యామ‌ల పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. పంజాగుట్ట పీఎస్‌లో శ్యామ‌ల‌తో పాటు ప‌లువురు సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయ‌న్స‌ర్ల‌పై కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే యాంక‌ర్, బిగ్‌బాస్ సెల‌బ్రిటీలు అయిన విష్ణుప్రియ‌, టెస్టీ తేజ త‌దిత‌రులు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అవ‌స‌ర‌మైతే మ‌ళ్లీ విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి వుంటుంద‌ని వాళ్ల‌కు పోలీసులు చెప్పారు.

ఇవాళ శ్యామ‌ల‌ను సుమారు మూడు గంట‌ల పాటు విచారించ‌డం గ‌మ‌నార్హం. మొత్తం ఎన్ని యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేశారు? ఒక్కోదానిపై ఎంతెంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నార‌నే అంశాల‌పై పోలీసులు విచారించిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంలో శ్యామ‌ల రాజ‌కీయంగా కూడా యాక్టీవ్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఆమెను సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ఇదిలా వుండ‌గా పోలీసుల విచార‌ణ‌లో ఏమ‌డిగార‌నే విష‌యాల్ని మీడియాతో పంచుకోడానికి ఆమె ఇష్ట‌ప‌డ‌లేదు. విచార‌ణ ద‌శ‌లో ఉండ‌గా మాట్లాడ్డం మంచిది కాద‌ని సున్నితంగా మీడియా ప్ర‌శ్న‌ల్ని శ్యామ‌ల తిర‌స్క‌రించారు. అయితే పోలీసుల విచార‌ణ‌కు పూర్తిస్థాయిలో స‌హ‌క‌రిస్తాన‌ని ఆమె చెప్పారు. బెట్టింగ్స్‌తో చ‌నిపోయిన వారి కుటుంబాల న‌ష్టాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేర‌న్నారు. బెట్టింగ్స్‌కు పాల్ప‌డ‌డం త‌ప్ప‌న్నారు.

10 Replies to “విచార‌ణ‌కు హాజ‌రైన యాంక‌ర్ శ్యామ‌ల‌”

  1. బెట్టింగ్స్ ఆడటం తప్పని తెలిసిన దానివి.. “తగ్గేదేలే” అంటూ ప్రచారం ఎందుకు చేసావు..?

    దొరికే వరకు పతివ్రత.. దొరికాక “శ్యామల” అని అనుకోవాలేమో..

    డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతారు.. ఈ జగన్ రెడ్డి జనాలు..

  2. ఒరేయ్ హెడ్డింగ్ వైసీపీ అధికార ప్రతినిధి అని కదరా ఉండాలి

  3. యాంకర్ శ్యామల ఏంట్రా వెర్రి పుష్పం, వైసిపి అధికార ప్రతినిధి శ్యామల అని రాయాలి

  4. US lo naana hungama, mogudu meedha cheating case lu, akka betting apps- inka enni enni darunalu choodali sir. Every year kotha Qualification – next election mostly Pawan against anukunta

Comments are closed.