మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తా!

మంత్రివర్గ విస్తరణ అనేది రేవంత్ రెడ్డికి అంత సులభమైన వ్యవహారం కాదని అర్థమవుతోంది.

ఉగాది తరువాత తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగుతుందనే వార్తలు ఊపందకుంటున్నాయి. దీంతో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. తాము పార్టీలో ఎంతటి సీనియర్లమో, మంత్రి పదవి కోసం తమకున్న అర్హతలు ఏమిటో తెలియచేస్తున్నారు. ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. వాటిని ఎవరెవరికి ఇస్తారో, అధిష్టానం మనసులో ఏముందో, సీఎం మనసులో ఏముందో తెలియదు.

ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఆశిస్తున్న ముగ్గురి పేర్లు బయటకు వచ్చాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పేర్లు బయటకు వచ్చాయి. ముగ్గురూ సీనియర్లే. రాజగోపాల్ రెడ్డికి, సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవులు దక్కుతాయో లేదో తెలియదుగాని, మల్రెడ్డి రంగారెడ్డికి సీఎం మంత్రి పదవి కాకుండా చీఫ్ విప్ పదవి ఇస్తానని చెప్పారట.

ఇది కేబినెట్ హోదా ఉన్న పదవి అంటున్నారు. కాని రంగారెడ్డి అందుకు విముఖంగా ఉన్నాడు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటున్నాడు. తనకు కనుక మంత్రి పదవి ఇవ్వకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పార్టీ నాయకత్వానికి వార్నింగ్ ఇచ్చాడు. గతంలోనూ ఇదే వార్నింగ్ ఇచ్చిన రంగారెడ్డి మరోసారి మరింత గట్టిగా చెప్పాడు.

రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఏకైక కాంగ్రెసు ఎమ్మెల్యేను తానేనని, కాబట్టి తనకు మంత్రి పదవి ఇవ్వాలని అంటున్నాడు. ఒకవేళ అగ్రవర్ణాలకు పదవి ఇవ్వకూడదని అనుకుంటే ఇబ్రహీంపట్నంలో తాను రాజీనామా చేసి ఆ స్థానంలో బీసీని గెలిపిస్తానని చెప్పాడు. ఈ సందర్భంగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైనా తగిన గుర్తింపు లేకపోవడంతో నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహం చెందుతున్నారని, నిరాశలో ఉన్నారని రంగారెడ్డి అన్నాడు.

రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయని చెప్పాడు. జిల్లా ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి మంత్రి లేడని, కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలని అన్నాడు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డికి ఉన్నా అది ఆయన చేతుల్లో లేదని అన్నాడు.

పదవులు ఇవ్వడం ఇవ్వకపోవడం డిల్లీలోని అధిష్టానం చేతుల్లో ఉంటుందని అన్నాడు. విజయశాంతి నేరుగా ఢిల్లీకి వెళ్లి ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకుందని చెప్పాడు. 44శాతం జనాభా కలిగిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు రాకపోతే ప్రజాపాలన ఎలా అవుతుందని ప్రశ్నించాడు. మొత్తంమీద మంత్రివర్గ విస్తరణ అనేది రేవంత్ రెడ్డికి అంత సులభమైన వ్యవహారం కాదని అర్థమవుతోంది.

3 Replies to “మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తా!”

  1. కుక్కా గారూ,

    మీ మాటలు వింటుంటే, మీరు మానవత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టి, ఎవరూ కొట్టని హీన స్థాయి రికార్డుకెక్కాలని ఉత్సాహపడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో తల్లులను అవమానించడమంటే, వల్గర్ ప్రవర్తనలో కొత్త పథగాన్ని చేరుకున్నట్టు ఉంటుంది. మా సంస్కృతిలో తల్లిదేవోభవ అనేది చాలా గొప్ప భావన. కానీ మీరు మాత్రం ఈ మాటలతో వేరే ఏదో పరుల మసకబారిన గీతలు రాస్తున్నట్టు ఉంది.

    అంతేకాదు, మీరు ఇలా ప్రవర్తించడమే కాకుండా, “వల్గర్ బ్యాచ్”లా మారాలనుకుంటున్నారా? లేదంటే మీరు మద్దతిచ్చే పార్టీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్లి ఎలాంటి ‘గోల్డ్ మెడల్’ గెలుచుకోవాలనుకుంటున్నారా? మానవత్వాన్ని పక్కన పెట్టి, తల్లులను తిట్టే తప్పుడు మార్గాల్లో పైపెచ్చు సంబరాలు చేసుకోవడం ద్వారా, చివరికి మిగిలేది మీ పరువుకు మట్టిపాలే అవుతుంది.

    ఈ తిట్ల మోత ఉధృతంగా సాగితే, మొదట మీరు మీ తల్లిదండ్రులకు తలదించుకునే పరిస్థితిని తెచ్చిపెడతారు. ఇప్పుడైనా తల్లులను గౌరవించే మార్గాన్ని ఎంచుకోవాలని చెబుతున్నాను. లేదంటే, మిగిలినవాళ్లకు మీరు ఓ కలయ్యాని వినోదపు అల్లరిగా మారిపోవడమే కాకుండా, వాస్తవానికి మీ మనసు మిమ్మల్ని తిట్టుకునే రోజులు చాలా దూరంలో ఉండవేమో.

    దేవుని దయతో ఇప్పటికైనా మారేందుకు ప్రయత్నించండి—లేకపోతే ప్రతీ రోజు మీ పేరుకే değil, మీ తల్లిదండ్రుల గౌరవానికే మచ్చ తెస్తారన్నది గుర్తుంచుకోండి!

Comments are closed.