విడ‌ద‌ల ర‌జినీని జైలుకు పంపేందుకు అవినీతి దొర‌క‌లేదా?

ఏదో ర‌కంగా ర‌జినీని జైలుకు పంపాల‌నే ప‌ట్టుద‌ల‌తో లావు, ప‌త్తిపాటి వ‌రుస కేసులు పెట్టిస్తున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి.

ఎవ‌రో పారిశ్రామిక‌వేత్త‌ను బెదిరించి రూ.2 కోట్లు వ‌సూలు చేశారంటూ మాజీ మంత్రి విడ‌ద‌ల రజినీపై ఏసీబీ కేసు పెట్టారు. ఆ కేసుపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వాటికి తాను భ‌య‌ప‌డే ప్ర‌శ్నే లేద‌ని తేల్చి చెప్పారు. మ‌హా అయితే జైలుకు పంపుతార‌ని, ఆ త‌ర్వాత మీ ప‌రిస్థితి ఏంటో ఆలోచించుకోవాల‌ని న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు, అలాగే మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావుకు గ‌ట్టి హెచ్చ‌రిక చేశారామె.

ఒక బీసీ మ‌హిళా నాయ‌కురాలిని, సీఎం చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే క‌క్ష‌క‌ట్టి కేసులు పెట్టిస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇప్ప‌టికే ఆమెపై ఎస్సీ, ఎస్టీ కేసు న‌మోదైంది. అయితే ఏపీ హైకోర్టులో ఆమెకు ముంద‌స్తు బెయిల్ ల‌భించ‌డంతో టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధుల ప‌న్నాగం పార‌లేదు. తాజాగా ఏసీబీ కేసు తెర‌పైకి వ‌చ్చింది. ర‌జినీతో పాటు ఆమె మ‌రిది, వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిపై కూడా కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

విడ‌ద‌ల రజినీ వైద్యారోగ్య‌శాఖ మంత్రిగా ప‌ని చేశారు. దోచుకోవాల‌నే స్వ‌భావ‌మే ఆమెదైతే, మంత్రిత్వ‌శాఖ‌ను ఊరికే వ‌దిలి పెట్టి వుండేవారా? అక్ర‌మంగా సంపాదించుకోవాలంటే ఎవ‌రినో ఆమె బెదిరించాల్సిన అవ‌స‌రం ఏంట‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. వైద్యారోగ్య‌శాఖ‌లో రూ.2 కోట్లు సంపాదించుకోడానికి అవ‌కాశం లేక‌పోవ‌డంతో, ఊరిమీద ప‌డ్డార‌ని అనుకోవాలా? వైద్యారోగ్య‌శాఖ కామ‌ధేనువు లాంటిది.

వైసీపీ ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చిన విభాగాలు ఏవైనా ఉన్నాయంటే… విద్య‌, వైద్య రంగాలే. వైద్య‌రంగంలో భారీ ఎత్తున వైసీపీ ప్ర‌భుత్వం నిధులు ఖ‌ర్చు పెట్టింది. మ‌రి వైద్యారోగ్య‌శాఖ‌లో విడ‌ద‌ల ర‌జినీ అవినీతి ఏదీ దొర‌క్క‌పోవ‌డంతోనే, న‌ర‌సారావుపేట ఎంపీ, చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే …ఈ విధంగా క‌క్ష తీర్చుకుంటున్నార‌ని అనుకోవాలా? వైసీపీ హ‌యాంలోనే సాటి ప్ర‌జాప్ర‌తినిధి అయిన ర‌జినీ వ్య‌క్తిగ‌త కాల్‌డేటాను పోలీసుల ద్వారా ఆయ‌న గారు తీశారంటే, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మ‌ళ్లీ అధికారంలో ఉన్న ఆ నాయ‌కుడు …ర‌జినీ ఆరోపిస్తున్న‌ట్టు క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు తెర‌లేపారంటే ఎవ‌రైనా న‌మ్మే ప‌రిస్థితి.

ఏదో ర‌కంగా ర‌జినీని జైలుకు పంపాల‌నే ప‌ట్టుద‌ల‌తో లావు, ప‌త్తిపాటి వ‌రుస కేసులు పెట్టిస్తున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. అయితే క‌క్ష‌పూరితంగా కేసులు న‌మోదు చేయ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్‌లో తాము కూడా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని గ్ర‌హిస్తే మంచిద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

27 Replies to “విడ‌ద‌ల ర‌జినీని జైలుకు పంపేందుకు అవినీతి దొర‌క‌లేదా?”

  1. మరి విడదల రజని అంత ఉత్తమురాలే అయితే.. జగన్ రెడ్డి ఆవిడని చిలకలూరి పేట నుండి గుంటూరు వెస్ట్ కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసాడో.. కూడా చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి..

  2. వైసీపీ హయం లో అంత సెంట్రలైజడ్ కరప్షన్ కదా రజని కి ఎందుకీ ఛాన్స్ ఇస్తారు సజ్జలో విజయసాయి పెద్దిరెడ్డి గారో సుబ్బారెడ్డి గారో తీసుకొంటారు కానీ ఈమెకి ఇచ్చే వెర్రిపప్పలు కాదు అందుకే ఈమె స్థాయిలో ఈమె ఇలాంటివి వెతుక్కొంది ఇళ్ల పట్టాల భూముల్లో రైతులు దగ్గర కక్కుర్తి పడ్డప్పుడే మన వాల్యుయేషన్ తెలిసిపోయింది

  3. సర్లే కాని వైసీపీ హయాములో లావు కృష్ణదేవరాయలు భూములు కొట్టేసాడు అని ఆవిడ చెప్పింది.ఆమెకు తెలిసిన విషయం అప్పటి సీఎం కి తెలియదా? తెలిసినా అవినీతిని పెంచి పోషించాడా?

    1. అంతవరకు నీ జగన్ రెడ్డి.. జగన్ రెడ్డి పెంచుకొనే కుక్కలకు మామూలుగా ఉండదు ..

      వెయిట్ చేయి.. వాచ్ చేయి.. చూసి నేర్చుకో..

      నీ జగన్ రెడ్డి మళ్ళీ వచ్చి చస్తే.. అప్పుడు ఆచరణ లో పెట్టుకో.. అంతవరకు మూసుకో..

      నీ కుక్కఅరుపులకు భయపడే వాడెవ్వడూ లేడు ఇక్కడ.. అని నీ జగన్ రెడ్డి కి నా మాటగా చెప్పుకో..

  4. మంచి రాతగాడిలా ఉన్నారు……. ఎవరుసార్ మీరు…… పేటకు వచ్చి అడగండి పదిమందిలొ ఇద్దరు అవినీతి లేదంటే ……మీరు గ్రేట్ రాతగారు…

  5. నేరానికి.. కులానికి.. లింకు పెట్టడం ఏంట్రా బుర్ర తక్కువ నీలి గొ ర్రె వెంకిటి .. రజినీ అక్క డబ్బులు తీసుకుందా లేదా, ఓనర్ ఇచ్చిన లొకేషన్ తో సహా ప్రూవ్ చేస్తున్నాడు.. బీసీ, అయినా ఓసీ అయినా ఇలాంటి పను లు చేయొచ్చా చెప్పు .. చదువు కున్న వాడివి తప్పు జరిగితే తప్పు అను అలా కాకుండా కులం కార్డు వాడలా !

  6. నే రా ని కి.. కులానికి.. లింకు పెట్టడం ఏంట్రా బుర్ర తక్కువ నీ లి గొ ర్రె వెంకిటి .. రజినీ అక్క డబ్బులు తీసుకుందా లేదా, ఓనర్ ఇచ్చిన లొకేషన్ తో సహా ప్రూవ్ చేస్తున్నాడు…. బీసీ, అయినా ఓసీ అయినా ఇలాంటి పను లు చేయొచ్చా చెప్పు .. చదువు కున్న వాడివి తప్పు జరిగితే తప్పు అను అలా కాకుండా కులం కార్డు వాడలా !

  7. నే రా ని కి.. కు లా ని కి.. లింకు పెట్టడం ఏంట్రా బుర్ర తక్కువ నీ లి గొ ర్రె వెంకిటి .. రజినీ అక్క డబ్బులు తీసుకుందా లేదా, ఓనర్ ఇచ్చిన లొకేషన్ తో సహా ప్రూవ్ చేస్తున్నాడు…. బీసీ, అయినా ఓసీ అయినా ఇలాంటి పను లు చేయొచ్చా చెప్పు .. చదువు కున్న వాడివి తప్పు జరిగితే తప్పు అను అలా కాకుండా కులం కార్డు వాడలా ! ఎవరినైనా వాళ్ళు తప్పు చేస్తే అ రె స్ట్ చేస్తే ఈ కులం కార్డు వాడే సంస్కృతి ఎప్పుడు పోతుంది. SC, ST, BC కులాల వాళ్ళు తప్పు చేయరా లేక చేసినా వాళ్ళని వదిలెయ్యాలా? ఈ దేశంలో బ్రాహ్మణులు, కమ్మవారు, రెడ్లు లాంటి అగ్రకులాలనే అ రె స్టు చేయాలి తప్ప తక్కువ కులాల వారు తప్పు చేసినా అరెస్ట్ చేయకూడదా?

  8. నే రా ని కి.. కు లా ని కి.. లింకు పెట్టడం ఏంట్రా బుర్ర తక్కువ నీ లి గొ ర్రె .. రజినీ అక్క డబ్బులు తీసుకుందా లేదా, ఓనర్ ఇచ్చిన లొకేషన్ తో సహా ప్రూవ్ చేస్తున్నాడు..బీసీ, అయినా ఓసీ అయినా ఇలాంటి పను లు చేయొచ్చా చెప్పు .. చదువు కున్న వాడివి తప్పు జరిగితే తప్పు అను అలా కాకుండా కులం కార్డు వాడలా ! ఎవరినైనా వాళ్ళు తప్పు చేస్తే అ రె స్ట్ చేస్తే ఈ కులం కార్డు వాడే సంస్కృతి ఎప్పుడు పోతుంది. SC, ST, BC కులాల వాళ్ళు తప్పు చేయరా లేక చేసినా వాళ్ళని వదిలెయ్యాలా? ఈ దేశంలో బ్రాహ్మణులు, కమ్మవారు, రెడ్లు లాంటి అగ్రకులాలనే అ రె స్టు చేయాలి తప్ప తక్కువ కులాల వారు తప్పు చేసినా అరెస్ట్ చేయకూడదా?

  9. ఎవరినైనా వాళ్ళు తప్పు చేస్తే అరెస్ట్ చేస్తే ఈ కులం కార్డు వాడే సంస్కృతి ఎప్పుడు పోతుంది. SC, ST, BC కులాల వాళ్ళు తప్పు చేయరా లేక చేసినా వాళ్ళని వదిలెయ్యాలా? ఈ దేశంలో బ్రాహ్మణులు, కమ్మవారు లాంటి అగ్రకులాలనే అరెస్టు చేయాలి తప్ప తక్కువ కులాల వారు తప్పు చేసినా అరెస్ట్ చేయకూడదా?

Comments are closed.