బెట్టింగ్ యాప్స్ కేసుతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. హీరోహీరోయిన్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయన్సర్లు కలిపి మొత్తంగా 25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీళ్లలో కొందరికి పోలీసులు నోటీసులిచ్చారు. కొందరు విచారణకు హాజరయ్యారు. మరికొందరు పరారీలో ఉన్నారు.
లిస్ట్ లో ఉన్న కొంతమంది హీరోలు, నటులు ఇప్పటికే స్పందించారు, తమదైన వివరణ ఇచ్చారు. ఇక లిస్ట్ లో లేని బాలకృష్ణ, ప్రభాస్ లాంటి నటులపై కూడా కేసులు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
ఓవైపు ఇంత నడుస్తుంటే, ఎఫ్ఐఆర్ లో పేరు ఉన్నప్పటికీ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు ఇద్దరు హీరోయిన్లు. వాళ్లే నిధి అగర్వాల్. ప్రణీత.
నటీనటుల జాబితాలో రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండతో పాటు వీళ్ల పేర్లు కూడా ఉన్నాయి. కానీ వీళ్లు మాత్రం వీటిపై రియాక్ట్ అవ్వలేదు. వీళ్లకు నోటీసులు ఇచ్చారా లేదా అనే అంశంపై పోలీసులు కూడా ఇంకా రియాక్ట్ అవ్వలేదు.
ముందుగా ప్రణీత విషయానికొద్దాం. ఆమె గతంలో ఓ బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేసింది. దానికి సంబంధించిన పాత వీడియోలు, ఫొటోలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆమె మాత్రం వీటితో సంబంధం లేకుండా ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉంది. కుటుంబంతో కలిసి ఫ్రాన్స్ వెళ్లిన ప్రణీత, అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూనే, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఇండియా వచ్చిన తర్వాత ఈ కేసుపై ఆమె స్పందిస్తుందేమో.
ఇటు నిధి అగర్వాల్ మాత్రం హైదరాబాద్ లోనే ఉంది. కానీ ఆమె ఇప్పటివరకు స్పందించలేదు. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెరపైకొచ్చిందో, అప్పట్నుంచి ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు.
Rey betting apps wrong aithe apps enduku ban cheyatam ledu ra.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Manchipani
నిధి అగర్వాల్ ok but ప్రణీత out dated so call her for inquiry…
శ్యామల అరెస్ట్ మీద జెగ్గులు స్పందన లేదా??