అరకు కాఫీ.. అరకు ఎంపీ ఏరీ?

అరకు ప్రధమ పౌరురాలిగా ఆమె ఈ ఈవెంట్ లో ఉంటేనే అర్ధం అందమని అంతా అభిప్రాయపడుతున్నారు.

అరకు కాఫీని పార్లమెంట్ లో సోమవారం లాంచనంగా ప్రారంభించారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అయిన అరకులో కాఫీ తోటలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అరకు కాఫీకి మంచి ప్రాచుర్యం కూడా ఉంది. అరకు కాఫీని ప్రమోట్ చేసేలా కార్యక్రమాలు జీసీసీ నిర్వహిస్తోంది. ఇది చాలా కాలంగా సాగుతూ వస్తోంది.

అరకు కాఫీ స్టాల్ ని పార్లమెంట్ లోని లోక్ సభ క్యాంటీన్ లో వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర గిరిజన మంత్రులు ఇతర కేంద్ర మంత్రులు ఎన్డీయే ఎంపీలు పాల్గొన్నారు. అంతా బాగానే ఉంది కానీ అరకు ఎంపీ ఏరీ అని అంతా అంటున్నారు. అరకు ఎంపీగా వైసీపీ నుంచి డాక్టర్ తనూజా రాణి గెలిచారు. జీసీసీ ఎండీ జీసీసీ చైర్మన్ వంటి వారు సైతం హాజరైన ఈ ఈవెంట్ లో అరకు ఎంపీగా లక్షలాది మంది ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధిగా ఆమె ఉంటే బాగుండేది అని అంటున్నారు.

ఆమె వైసీపీ ఎంపీ కావడంతో ఆమెను పిలవలేదా లేక పిలిచినా ఆమె హాజరు కాలేదా అన్నది తెలియదు కానీ అరకు నుంచి ఒక మహిళా ఎంపీ, విద్యాధికురాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశంలోని అత్యున్నత చట్ట సభ వద్ద అరకు కాఫీ స్టాల్ ప్రారంభం అంటే ఆమె ఉండాల్సింది అన్నది చాలా మంది అనుకునే మాట.

ఇది అభివృద్ధి కార్యక్రమం, ఏపీకి అరకుకు గర్వకారణం అయిన ఈవెంట్. ఇందులో రాజకీయాలకు తావు లేకుండా ప్రజా ప్రతినిధులు అంతా కలసిమెలసి పాల్గొంటే బాగుండేది. వైసీపీ ఎన్డీయే ఎంపీలతో కలవదు కాబట్టి అరకు ఎంపీ దూరంగా ఉండిపోయారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు అలా అనుకున్నా తప్పే అవుతుంది అని అంటున్నారు. ఒకవేళ ఆమెను పిలవకపోయినా కూడా అది పొరపాటే అవుతుంది అని అంటున్నారు. అరకు ప్రధమ పౌరురాలిగా ఆమె ఈ ఈవెంట్ లో ఉంటేనే అర్ధం అందమని అంతా అభిప్రాయపడుతున్నారు.

20 Replies to “అరకు కాఫీ.. అరకు ఎంపీ ఏరీ?”

  1. పిలిచినా …వస్తారు అని నమ్మకం లేక పిలిచి ఉండరు. ఎందుకంటే వారి స్కూల్, నాయకుడు అటువంటివాడు. రాజధాని శంకుస్థాపనకు పిలిస్తే రాడు, mla గా ఎన్నుకొంటే అసెంబ్లీకి రాడు, పోనీ పార్టీ వారు కలుద్దాం అంటే వారానికి నాలుగు రోజులు పక్క రాష్ట్రంలో ఉంటాడు.

  2. జగన్ రెడ్డి వెళ్ళొద్దన్నాడేమో..

    వాడొక దరిద్రుడు.. వాడు బాగు పడడు .. ఇంకొకకరిని ఎదగనీయడు ..

  3. బుద్ధి ఉందా నీకు. ఇది ఎవరి ఇంట్లో వేడుక అని పిలవాలి ? అరకు కాఫీని ప్రమోట్ చెయ్యాల్సిన బాధ్యత తనకి లేదా ?

  4. భీమవరం లో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహాం ప్రధాని ప్రారంభం చేసినప్పుడు స్థానిక ఎంపీ గారి ని ఎందుకు రానివ్వకుండా ఆపారు అని రాయలేదే..

  5. మీ ఉద్దేశం కరెక్టే కానీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు చెప్పిన ప్రకారం గౌరవాలు ఇచ్చి ఉంటే ఈరోజు వారు చేసే పనికి తప్పు పట్టవచ్చు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలని పెద్దలు అంటారు కదా, అది వైసిపి గవర్నమెంట్ లో చేశారా?

  6. అది దినం తద్దినం శవం అయితే మీ జగ్లక్ గాడు పిలవకుండానే వెళ్లొచ్చు .

    కాని అది కాఫీ stall ఓపెనింగ్ @ పార్లమెంట్ raa g ut Le.

  7. అ ది ది నం త ద్ది నం శ వం అ యి తే జ గ్ల క్ గా డు పి ల వ కుం డా నే వె ళ్లొ చ్చు .

    కా ని అ ది కా ఫీ s t a l l ఓ పె నిం గ్ @ పా ర్ల మెం ట్ r aa g* ut Le.

Comments are closed.