ఎమ్బీయస్‍: వినుడు స్టాలిన్ని.. కనుడు పిల్లల్ని

ఇప్పుడీ డీలిమిటేషన్ గొడవ వచ్చింది కాబట్టి పిల్లల్ని కనండి అనే పల్లవి స్టాలిన్ అందుకున్నాడు కానీ బాబు కొన్నాళ్ల క్రితమే మొదలుపెట్టారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ యీ మధ్య ఒక పెళ్లికి వెళ్లి ‘పెళ్లి కాగానే పిల్లల్ని కనండి, 16 ఐశ్వర్యాలకు గుర్తుగా 16 మందిని కంటే మరీ మంచిది, వాళ్లకు చక్కని పదహారు అణాల తమిళ పేర్లు పెట్టండి’ అంటూ సలహా యిచ్చారు. ఉత్తరాది వాళ్లతో పోటీ పడి పిల్లల్ని కనండి అనే స్లోగన్ అందుకున్నాడాయన. ‘ఒంటరిగా మిగలకండి, పెళ్లి లేటు చేసుకోకండి, త్వరగా పెళ్లి చేసుకుని సాంసారిక సుఖాన్ని, తోడులో ఉండే ఆనందాన్ని పొందండి’ అనే ప్రబోధం మంచిది. పెళ్లి చేసుకోగానే పిల్లల్ని కనండి అని చెప్పడం కూడా వేస్ట్. ‘హేవ్ సెక్స్, నాట్ బేబీస్’ అని 1970లలో నినాదంగా ఉండేది. పెళ్లి చేసుకోగానే సరి కాదు, ఒకరితో మరొకరికి ఎజస్ట్ కావడానికి టైము పడుతుంది. ఫర్వాలేదు, యీ బంధం నిలుస్తుంది అనే నమ్మకం కుదిరాకనే యిద్దరూ కలిసి మరొక జీవిని యీ లోకంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తే మంచిది.

లేకపోతే అహంకారాలతో వీళ్లిద్దరూ విడిపోతే, ఆ పిల్లల ఎమోషనల్ వాక్యూమ్ మాటేమిటి? ‘భార్యాభర్తలు విడిపోవచ్చు కానీ తల్లిదండ్రులు విడిపోకూడదు’ అనే సినీ డైలాగులో చాలా గొప్ప సందేశం ఉంది. లేటుగా పెళ్లి చేసుకోవడం, యిప్పటికే లేటయిపోయింది, యింకా లేటైతే డెలివరీ టైములో యిబ్బంది అంటే తొందరపడి పిల్లల్ని కనడానికి ఉపక్రమించడం – సరైన పద్ధతి కాదు. పిల్లలంటూ పుట్టుకుని వస్తే యీ రోజుల్లో భార్యాభర్తలిద్దరి కెరియర్లో ఎవరో ఒకరి దానికి ఎంతో కొంతకాలం విఘాతమో, కాస్త వెనక్కి తగ్గడమో తప్పదు. ఇద్దరూ కెరియర్లో దూసుకుపోవాలి, పిల్లలూ సవ్యంగా పెరగాలి అంటే కుదిరే పని కాదు. ఇవన్నీ ఆలోచించకుండా పిల్లల్ని కనండి, కనండి అని నాయకులు నినాదాలిస్తూ ఉంటే ఒళ్లు మండుతుంది.

పిల్లలు పుట్టాక వాళ్లకి చక్కని తమిళ పేర్లు కూడా పెట్టాలని స్టాలిన్ సజెషన్. అసలిప్పటికే పిల్లల పేర్లు పెట్టడమనేది చాలా పెద్ద పని అయిపోయింది. పిల్లల పేర్లు సూచించమంటూ నాకు మెయిల్స్ రాసేవాళ్లకి నా వలన కాదని చెప్పి దణ్ణం పెడతాను. ప్రతివాడికీ సృష్టిలో అంతకు ముందు లేని పేరు కావాలి. సరికొత్తగా ఉండాలి. ఎవరూ విని ఉండకూడదు. వాళ్ల తర్వాత వేరెవరూ ఆ పేరు పెట్టకూడదనే దురాశ కూడా ఉంది. సీక్రసీ మేన్‌టేన్ చేయాలి, లేకపోతే బంధువుల్లో, మిత్రబృందంలో ఎవరో ఒకరు దీన్ని ముందే వాడేసుకుని మనకు నావెల్టీ లేకుండా చేస్తారనే భయం ఉంది. పేర్లకి కాస్త ట్రెడిషనల్ లుక్ ఉండాలి కానీ అర్థం గురించి పట్టింపు లేదు. చాలామంది నాకు ఓ పేరు రాసి యిది ఎలా ఉంది? అని అడుగుతారు. దీని అర్థమేమిటి? అని అడిగితే జ్ఞాని, ప్రతిభావంతుడు, సౌందర్యవతి… యిలా ఏవేవో చెప్పేస్తారు.

ఈ అర్థం ఏ నిఘంటువులో చూశారు? సంస్కృత నిఘంటువా? అమర కోశమా? అని అడిగితే ‘నెట్‌లో చూశాం, ఎవరో రాశారు’ అంటారు. దాని ఆథెంటిసిటీ వీళ్లకు తెలియదు. పిల్లో, పిల్లాడో పుడితే వేలాది రూపాయలు వాళ్ల డ్రస్సు మీద ఖర్చు పెడతారు కదా వందల రూపాయల్లో వచ్చే నిఘంటువు కొని చూడలేరా? అర్థవంతమైన పేరు పెట్టలేరా? అని మందలిస్తాను. వినరు. పిలిచే సౌలభ్యం కూడా చూడరు. కొందరికి ఫారిన్ వాళ్లు పలకగల పేరు కావాలి, మరి కొందరికి పలకడానికి ఎంత క్లిష్టంగా ఉంటే అంత మోజు. పుట్టేది ఆడో, మగో తెలియదు కాబట్టి, రెండు రకాల పేర్లు తయారు చేసి పెట్టుకోవడం మరో కసరత్తు. మనం అన్నిటా అనుకరించే అమెరికా వాళ్లు పిల్లల విషయంలో యింత శషభిషలు పడరు. ఎప్పుడు చూసినా జాన్, విలియమ్స్, డోనాల్డ్, అబ్రహామ్.. యివే పేర్లు తిరుగుతూ ఉంటాయి. మనం మాత్రం గర్భిణి స్త్రీ ఆరోగ్యం కంటె యీ పేర్ల గురించి వర్రీ కావడంలోనే ఎక్కువ సమయం గడుపుతాం.

ఇలాటి పరిస్థితుల్లో స్టాలిన్ దానికి తమిళ కోణం కూడా చేర్చాడు. సినిమాల విషయంలో కూడా ఇంగ్లీషు పేర్లు వద్దు, తమిళ పేర్లు అంటూ చావగొడతారు. రోబో అంటే అందరికీ అర్థమయ్యే పేరు. అది కాకుండా మొదటి భాగానికి ‘‘యందిరన్’’ (యంత్రుడు అనే అర్థంలో), రెండో దానికి 2.0 అని పెట్టించారు. ‘‘పొన్నియన్ సెల్వన్’’ అనేది తమిళనాట ప్రసిద్ధి చెందిన పేరు. తమిళ వెర్షన్‌కు ధారాళంగా వాడవచ్చు. తెలుగు, హిందీ వెర్షన్లకు కూడా అదే పేరెందుకు? ‘‘కావేరీ పుత్రుడు’’, ‘‘కావేరీ (లేదా నదీ) పుత్ర్ ’’ అంటే పోలేదా? నోరు తిరగడానికి కష్టమైన పేర్లు పెట్టి సాధించేదేముంది? తమిళ పేర్లు కొన్ని యితరులకు కొరుకుడు పడవు. వాళ్ల లిపికి అక్షరాలు తక్కువ కావడంలో ఒకే అక్షరాన్ని వివిధ శబ్దాలకు వాడడంతో స్పెల్లింగుల్లో తికమకలు వచ్చేసి, ఒక దాని బదులు మరొకటి పలుకుతూంటారు.

వాళ్లలో క్రమేపీ మార్పులు వచ్చి, టిపికల్ తమిళ పేర్లు తగ్గించి, మామూలు పేర్ల వైపు పయనిస్తున్న యీ సమయంలో స్టాలిన్ టిపికల్‌వే పెట్టండి అంటూ పిలుపు నిచ్చారు. దానికి ముందు ఆయన తన పేరు గురించి ఆలోచించాల్సింది, స్టాలిన్ అనేది తమిళ పేరా? సరే వాళ్ల నాన్న ఏదో ఆవేశంలో ఆ పేరు పెట్టేశాడనుకుందాం. ఈయన తన కొడుక్కి ఏం పేరు పెట్టాడు? ఉదయనిధి సంస్కృతజన్యం కాదా! తెలుగు కుటుంబానికి చెందిన కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. అది దేవుడి పేరనీ, సంస్కృతపు పేరనీ, తన పేరుని కరుణానిధిగా మార్చుకున్నాడు. అదీ సంస్కృతపు పేరే కదా అని తర్వాతి రోజుల్లో అడిగితే ‘అది సంస్కృతం అని నాకు తెలియదు, తమిళం అనుకున్నాను’ అన్నాడాయన. పొరపాటు తెలుసుకున్నాకైనా పేరు మళ్లీ మార్చుకోలేదు. సినారె ఒకసారి దానిపై ‘దానికి తెలుగు పేరు నన్నడిగితే ‘జాలి కుప్ప’ అని సూచిస్తాను అని చమత్కరించారు. మరి యీ స్టాలిన్‌కు కొడుకు పుట్టేనాటికి ఏది సంస్కృతమో, ఏది తమిళమో ఆ కుటుంబానికి స్పష్టత వచ్చి ఉంటుంది కదా. అయినా తన కొడుక్కి ఉదయనిధి అని పేరు పెట్టాడు. ఆ పదాలు తమిళంలో కూడా ఉన్నాయంటే కుదరదు. టిపికల్ తమిళ పదం అంటే అది యితర భాషల్లో కనబడకూడదు.

ఇక పిల్లల సంఖ్య కొస్తే యిద్దర్నే కని, తక్కినవాళ్లందరినీ యిబ్బడిముబ్బడిగా పిల్లల్ని కనమని ప్రబోధమొకటి. ఉదయనిధికీ యిద్దరే పిల్లలు. ఈయన కంటె ఆచంట మల్లన్న అమరావతిలో ఉన్నారు. ఆయనకు ఒకడే కొడుకు. 42 ఏళ్ల ఆ కొడుక్కి యిప్పటివరకు ఒకడే కొడుకు. రాష్ట్రప్రజలను ఎడాపెడా కనేయమని పిలుపు మీద పిలుపు నిచ్చేస్తున్నాడు. పదిహేను రోజుల క్రితం ‘పాప్యులేషన్ డైనమిక్స్’ సదస్సులో మాట్లాడుతూ ‘దక్షిణ భారతంలో అభివృద్ధి మెరుగ్గా ఉన్నా, జననాల రేటు తగ్గిపోతోంది. జనాభా విషయంలో యుపి, బిహార్ మనల్ని కాపాడుతున్నాయి.’ అన్నారు. అభివృద్ధిని అనవరతం కలవరించే, అభివృద్ధికి పాంటు, షర్టు వేస్తే నేనే అని చెప్పుకునే చంద్రబాబు నోట యీ మాటలా? హతవిధీ!

జనాభా విషయంలో యుపి, బిహార్‌లు మనల్ని కాపాడుతున్నాయా? జనాభా పెంచితే మనల్ని కాపాడినట్లా? ఈ కోణం ఎప్పుడూ వినలేదే! హిందువులు జాగ్రత్తగా కుటుంబాలు పెరగకుండా చూసుకుంటూ ఉంటే ముస్లిములు మాత్రం తెగ కనేస్తూ ఉంటారని హిందూత్వవాదులు యీసడిస్తూ ఉంటారు. చంద్రబాబు నిర్వచనం ప్రకారం అలా కనేసే ముస్లిములు మనల్ని కాపాడుతున్నారని గ్రహించి వారిని సత్కరించాలి. బాబు ఆంధ్ర రాష్ట్రంలో ఆ దిశగా చట్టాలు కూడా మారుస్తున్నారు. ఇద్దరి కంటె ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని ఉన్న బిల్లును రద్దు చేశారు. ‘ఇద్దరి కంటె ఎక్కువ ఉంటనే పోటీకి అర్హులనే చట్టం రావాలి’ అని బాబు పిలుపు నిచ్చారు.

దాన్ని కాపాడడం అంటారో లేదో కానీ, ఉత్తరాదిన మాత్రం తెగ కనేస్తున్నారు. టిఎఫ్‌ఆర్ (టోటల్ ఫెర్టిలిటీ రేట్) తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రలలో 1.8, తెలంగాణలో 1.8, తమిళనాడులో 1.6 ఉంటే యుపిలో 2.4, బిహార్‌లో 3.0, ఎంపీలో 2.0, రాజస్థాన్‌లో 2.3, హరియాణాలో 2.1 ఉంది. 1971తో పోలిస్తే తమిళనాడు జనాభా 75% పెరిగితే యుపిది 126%, బిహార్‌ది 147% పెరిగాయి. ఇలా పెంచి వాళ్లు సాధించినదేముంది? 20% జనాభా మాత్రమే ఉన్న దక్షిణ రాష్ట్రాలు జిడిపికి 31% కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే, అవెంత చేస్తున్నాయి? జిడిపికి దక్షిణాది రాష్ట్రాలు 32 లక్షల కోట్లు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే, యుపి, బిహార్ కలిసి 17 లక్షల కోట్లు యిస్తున్నాయి. మన దగ్గర తీసుకుని వాళ్ల దగ్గర ఖర్చు పెడుతోంది కేంద్రం! కుటుంబ నియంత్రణను ప్రోత్సహించి, మహిళల, శిశువులు ఆరోగ్యం మెరుగయ్యేందుకు ఉత్తరాది రాష్ట్రాలు ఖర్చు పెట్టవు. గుళ్లు కట్టడానికి (రామమందిరం అయిపోయింది కాబట్టి యిక సీతామందిరకం కడతామని అమిత్ షా చెప్పారు), మసీదులు కూల్చడానికి, ఆకాశమెత్తి విగ్రహాలు నెలకొల్పడానికి ఖర్చు పెడతాయి. చంద్రబాబు గారి మాటల్లో రక్షించడం అంటే యిదే కాబోలు!

ఇప్పుడీ డీలిమిటేషన్ గొడవ వచ్చింది కాబట్టి పిల్లల్ని కనండి అనే పల్లవి స్టాలిన్ అందుకున్నాడు కానీ బాబు కొన్నాళ్ల క్రితమే మొదలుపెట్టారు. ఏమిటో ఆ విజనరీ విజన్! పిల్లలు ఎక్కువ పుట్టుకుని వస్తే ఆహారానికి కొరత, నివాసాలకు కొరత, ఆసుపత్రులకు కొరత, వాతావరణ కాలుష్యం, అధిక ధరలు… ఒకటా రెండా, అన్నీ సమస్యలే. లాభం ఎవరి కంటె మనల్ని కన్స్యూమర్స్‌గా, మన దేశాన్ని ఒక మార్కెట్‌గా చూసే బహుళజాతి కంపెనీలకు మాత్రమే! మనకేదైనా కొత్తది అంటగడితే వేలంవెర్రిగా కొని, వాళ్లకు లాభాలు పెంచుతాం కాబట్టి వాళ్లు కోరుకోవచ్చు. వారి ఏజంటుగా పేరు బడిన బాబు కోరుకోవచ్చు. కానీ సామాన్యుడు మాత్రం అధిక సంతానం వలన అనర్థాలు గుర్తించి, పరిమిత సంతానమే చాలనుకుంటున్నాడు.

ఈ నాయకులు తమ ఓట్ల కోసం, యిప్పుడీ డీలిమిటేషన్ గొడవలో తమ వాటా సీట్లు తగ్గకుండా ఉండడం కోసం మనల్ని కనమంటున్నారు కానీ, కూడు పెట్టడానికి, గూడు యివ్వడానికి ముందుకు వస్తారా? ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తారా? విదేశీ విద్యకు పంపితే మనమే చదివించుకోవాలి, ఏ రాజులూ మనకు సాయపడరు. ఎన్నికల ముందు అన్నీ యిస్తామంటారు. నెగ్గాక లెక్కలు సరిగ్గా చూసుకోక అలా చెప్పేశాను, యిప్పుడు సంపద సృష్టించనీయండి, అప్పుడు పంచుతాను, అప్పటి దాకా నోట్లో బొటనవేలు వేసుకుని కూర్చోండి అని చెప్తారు. ఇవన్నీ గ్రహించే ప్రజలు మేలుకొన్నారు. నీ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటే మాకెందుకు, మా పాటికి మేం జాగ్రత్త పడతాం అంటున్నారు. అలా పడిన మధ్యతరగతి కుటుంబాలు, కొన్ని పేద కుటుంబాలు గత 50 ఏళ్లలో చాలా బాగుపడ్డాయి. ఆ ఎవేర్‌నెస్ తక్కువగా ఉన్న పేదల్లో క్రమేపీ అవగాహన పెరుగుతోంది.

మా కుటుంబాల్లో మా నాన్న తరంలో సగటున 5-6 పిల్లలుండేవారు. కొంతమందికి చదువు వచ్చేది, కొందరికి అబ్బేది కాదు. చాలామంది ఆడపిల్లలను ఎస్సెల్సీతో చదువు ఆపించేసేవారు. బొటాబొటీ ఆదాయాలతో, పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం అప్పులు చేస్తూ జీవితాలను భారంగా గడిపేవారు. మా తరం వచ్చేసరికి యిద్దరు పిల్లలనేది స్థిరపడింది. ఆడైనా, మగైనా వచ్చినంత వరకు చదువు చెప్పించడం, చదువులకు, పెళ్లిళ్లకు డబ్బుకి తడుముకోనక్కర లేకుండా, ముందుగానే దాచుకోవడం అదీ పెరిగింది. ఇక తర్వాతి తరం వచ్చేసరికి వైద్యకారణాల వలననో, ఒకరు చాలులే అనుకోవడం చేతనో, సగం మంది ఒక బిడ్డతో సరిపెట్టుకుంటున్నారు. అందుకే టిఎఫ్‌ఆర్ 1.7 ఉంది. ఇది అన్ని వర్గాలను కలిపితే వచ్చే సగటు. మధ్యతరగతిని మాత్రం తీసుకుని చూస్తే, యింకా తక్కువ ఉండవచ్చు.

ఈ తగ్గుదలకు కారణం ఎవరో కత్తెర పట్టుకుని నిలబడడం చేత అని అనుకోవద్దు. సామాజికంగా స్త్రీచైతన్యం, పురుషులలో కలిగిన సంస్కారం తెచ్చిన మార్పులు ప్రధానకారణం. పిల్లలు, సంసారం అనగానే ముఖ్యంగా స్త్రీదే బాధ్యత అవుతోంది. ఇటీవలి కాలంలో మగవాళ్లలో మద్యపానం పెరిగాక, స్త్రీ మీదే భారం ఎక్కువగా పడుతోంది. ఇంతమంది పిల్లలను కనలేను, పెంచలేను, యిన్ని ప్రసవాలు తట్టుకోలేను అని స్త్రీలు స్వతంత్రించి చెప్పగలిగే రోజులు వచ్చాయి. పిల్లల్ని మేం చూసుకుంటాంలే అని భరోసా యిచ్చే ఉమ్మడి కుటుంబాలూ లేవు. అత్తగారికి భయపడి, ఎదురాడలేని కోడళ్లూ తగ్గారు. స్త్రీలు చదువుకుని, ఉద్యోగాలు చేయడం, వ్యాపారాల్లో పాలు పంచుకోవడం పెరగడంతో వాళ్ల మాటకు విలువ యివ్వడం పెరిగింది. పూజాపునస్కారం పెరిగినా, ‘నారు పోసినవాడు నీరు పోయడా’ అంటూ దేవుడిపై గుడ్డిగా భారం వేసే రోజులు పోయేయి. కొడుకు కోసం వేచి చూస్తూ కూతుళ్లను కనే పద్ధతి బాగా తగ్గింది. కూతురే మేలు అనుకుంటున్నారు.

ఈ మార్పు ఒక్క రోజులో వచ్చినది కాదు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచి క్రమేపీ వచ్చింది, అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని కులాల్లోనూ! అక్షరాస్యత రేటు బట్టి మార్పులో తేడా కనబడుతోంది. ‘హమ్ పాంచ్, హమారే పచ్చీస్’ అని వెక్కిరించబడే (అలాటి భారతీయ ముస్లిము కుటుంబం యిప్పటిదాకా నేను ఒక్కటీ చూడలేదు) ముస్లిములలో కూడా సంతాన సాఫల్య రేటు తగ్గింది. గతంలో కంటె యిప్పుడు తక్కువమందిని కంటున్నారు. నిరక్షరాస్యత, మతమౌఢ్యం తగ్గిన కొద్దీ రిప్రొడక్షన్ రేటు తగ్గుతూ వస్తోంది. చదువుకున్న మధ్యతరగతి ముస్లిముల్లో సంతానోత్పత్తి రేటు యించుమించు హిందువులతో సమానంగా ఉంటోంది. ఉత్తరాదిన కూడా రీజనరేషన్ రేటు తప్పకుండా తగ్గింది. తగ్గాల్సినంత తగ్గలేదంతే! ఇవన్నీ జనరలైజేషన్లే. మా పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసినప్పుడు మా లాటి కుటుంబాలలో కూడా నా ఏజ్ గ్రూపులో వున్నవారు ముగ్గురేసి పిల్లల్ని కలిగి వుండడం చూసి తెల్లబోయాను.

అధిక జనాభా కారణంగా పండించిన పంట సరిపోకపోవడం, ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవడం యివన్నీ చూసి భారత ప్రభుత్వం 1952లో కుటుంబ నియంత్రణ కార్యక్రమం మొదలుపెట్టినా, మరో పదేళ్ల తర్వాతి నుంచి ఉధృత ప్రచారం చేయసాగింది. అప్పట్లో అయిదారుగురు పిల్లలుండే వారు కాబట్టి, ‘దో యా తీన్ బచ్చే, ఘర్‌మే హోతే హై అచ్ఛే’ అనే స్లోగన్ మొదట వినిపించారు. కొన్నాళ్లకు ‘హమ్ దో, హమారే దో’గా మార్చి రెండుకు పరిమితం చేసుకోమన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేసుకుంటే ట్రాన్సిస్టర్ బహుమతిగా యిచ్చేవారు. ఇలా చెప్పగాచెప్పగా జనాలు వినసాగారు. ఆపరేషన్ చేయించుకుంటే లైంగిక సామర్థ్యం పోతుందనే అపోహలు క్రమేపీ తొలిగిపోయాయి.

1975-77 మధ్య నడిచిన ఎమర్జన్సీ సమయంలో సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో బలవంతపు కు.ని. ఆపరేషన్లు ఉత్తరాది రాష్ట్రాలలో జరగడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 1977 ఎన్నికలలో ఇందిర ఓటమికి అదే కారణమంటూ తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వాలు కునిని పట్టించుకోవడం మానేశాయి. 1980లో ఇందిర తిరిగి అధికారంలోకి రావడానికి దీనికీ లింకు పెట్టలేదు కానీ అవి యిక యీ కార్యక్రమాలను, ప్రచారాన్నీ గాలికి వదిలేశాయి. అయినా ప్రజలు తమంతట తామే జాగ్రత్తపడ్డారు కాబట్టి యీ మాత్రపు పెరుగుదలే ఉంది. నిష్కర్షగా చెప్పాలంటే విద్యపై మోజు విపరీతంగా పెరగడం, స్కూలు, కాలేజీ ఫీజులు భారీగా పెరగడం కూడా పిల్లలు ఎక్కువగా వద్దు అనుకోవడానికి కారణమయ్యాయి. అన్నిటికంటె ముఖ్యం పిల్లల్ని కాపాడుకోవడం, ఆడపిల్లయితే అత్యాచారానికి, మగపిల్లవాడైతే కిడ్నాప్‌కి, ఏమీ జరగకపోయినా టీనేజి రాగానే వాళ్లు డ్రగ్స్‌కి – గురి అవుతారేమోనని అడలి చావడం యివీ కారణాలే!

ప్రకృతి కూడా వీటిలో ఒక పాత్ర పోషిస్తుంది అనుకోవాలి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్, ఇంజురీస్ అండ్ రిస్క్ ఫ్యాక్ట్రర్స్ స్టడీ (జిబిడి) 2021 ప్రకారం ఇండియాలో 1950లలో ఫెర్టిలిటీ రేటు 6.18 ఉంటే 2021 నాటికి 1.9 అయింది. జనాభా స్థిరంగా ఉండాలంటే రిప్లేస్‌మెంట్ రేట్ 2.1 ఉండాలి. ఇది దాని కంటె యిది తక్కువ. 2100 నాటికి యిది 1.04 కావచ్చని జిబిడి అంచనా. ఎందుకంటే వైవాహిక వ్యవస్థ చెదిరింది. సహజీవనం, పిల్లలు లేకుండా హాయిగా గడపడం అనేవి, ఆకర్షణీయంగా మారుతున్నాయి. ఇవన్నీ తెలిసి, స్టాలినూ, బాబూ పిల్లల్ని కనమని పిలుపు నివ్వడం దేనికి? పార్లమెంటులో వాళ్ల వాళ్ల రాష్ట్రాల వాటా తగ్గిపోకూడదని! జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడంపై రాజకీయంగా పోరాడాలి తప్ప దానికై మన కుటుంబాలను బలి చేస్తే ఎలా?

హెచ్చుమంది పిల్లల్ని కంటె వీళ్లు వచ్చి పోషిస్తారా? తమ్ముళ్లూ రోజూ తాగండి అంటూ మొగుళ్ల చేత తాగించి, బాబు యిల్లాళ్లపై పిల్లల భారాన్ని పెంచుతున్నారు. తల్లికి వందనం క్రింద ప్రతి బిడ్డకూ 15 వేలు చొప్పున అని హామీ యిచ్చి, యిప్పటిదాకా ఒక్క బిడ్డకూ యివ్వటం లేదు. ప్రభుత్వ స్కూళ్లను నీరు కార్చి, విద్యపై ఖర్చు పెంచుతున్నారు. 17 మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేసి వైద్యం ఖర్చూ పెంచుతున్నారు. ఇన్నాళ్లూ తెలుగువారికి దిశానిర్దేశం చేసి, వాళ్లను బాగుపరిచాను అని చెప్పుకుంటూ వచ్చి సడన్‌గా ఉత్తరాది వాళ్లు మనకు ఆదర్శమనడమేమిటి? వాళ్లు ఐటీ ఉద్యోగాల్లో ఉన్నారా, మన దగ్గర కూలీలుగా వస్తున్నారా? వాళ్లలాగే మనమూ యిబ్బడిముబ్బడిగా కని, కూలీలుగా పర రాష్ట్రాలకు వెళ్లాలా? మొన్ననే చదివాను. దక్షిణాదికి తరలి వస్తున్న కూలీల కారణంగా యిక్కడి రాష్ట్రాలలో ద్రవ్యోల్బణం ఉత్తరాది కంటె పెరుగుతోందట. అన్ని విధాల మనకు అనర్థమే!

ఇక దక్షిణాది రాష్ట్రాలను ఆందోళన పరుస్తున్న డీలిమిటేషన్ గురించి కాస్త చెపుతాను. ప్రతి ఎంపీ యిన్ని లక్షల మందికి ప్రాతినిథ్యం వహించాలి అనే ఉరామరి లెక్క మీద జనాభా లెక్క ప్రకారం ప్రతి రాష్ట్రానికి పార్లమెంటు సీట్లు యిన్ని అని కేటాయించారు. కుటుంబ నియంత్రణ ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడానికి 1971 దగ్గర జనాభా సంఖ్యను ఫ్రీజ్ చేసి, ఆ పైన మీ జనాభా ఎంత పెరిగినా, మీ పార్లమెంటు సీట్లు పెరగవు అని మేకు కొట్టారు. ఇప్పటి బిజెపి ప్రభుత్వం ఆ మేకు తీసేసి, 2026 జనాభా ప్రకారం సీట్లు పెంచుతాం అంటోంది. దానివలన దక్షిణాది రాష్ట్రాల సీట్లు పెరగవు అనే అర్ధసత్యాన్ని మాత్రం అమిత్ షా చెప్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు బాగా పెరిగి, మొత్తం సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గిపోతుంది అని చెప్పటం లేదు. కానీ జరిగేది అదే!

దీని అర్థం దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోయి, వారి డిమాండ్లను, అభిప్రాయాలను పట్టించుకోనక్కర లేకుండా కేవలం నార్త్ సీట్లతో కేంద్రం పాలించేయవచ్చు. కుటుంబ నియంత్రణ పాటించి, అనేక రకాలుగా అభివృద్ధి సాధించిన దక్షిణాదికి యిది దండన, ఏ క్రమశిక్షణా లేని ఉత్తరాదికి బహుమతి అని దక్షిణాది రాష్ట్రాల గగ్గోలు. ఈ కసరత్తు మరో 25 ఏళ్లు వాయిదా వేయండి అని చెన్నయ్‌లో సమావేశమైన ముఖ్యమంత్రులు, పార్టీ నాయకులు కోరారు. డీలిమిటేషన్ తర్వాత వచ్చే మార్పుల గురించి మిలన్ వైష్ణవ్, జమియే హింట్సన్ ఒక లెక్క యిచ్చారు. దీని ప్రకారం పార్లమెంటు స్థానాల సంఖ్య యథాతథంగా ఉంచి 2026 జనాభా ప్రకారం మార్పులు చేస్తే, కేరళ, తమిళనాడు చెరొక 8, ఆంధ్ర, తెలంగాణ కలిసి 8, కర్ణాటక 2 కోల్పోతాయి. బెంగాల్ 4, ఒడిషా 3, పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్ చెరో 1 కోల్పోతాయి. యుపికి 11, బిహార్‌కు 6, రాజస్థాన్‌కు 6, ఎంపీకి 4 అదనంగా వచ్చి చేరతాయి. ప్రస్తుతం 543 స్థానాల్లో హిందీ భాషా రాష్ట్రాలకు 226 స్థానాలు ఉంటే, పునర్విభజన తర్వాత 259కి పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 129 పునర్విభజన తర్వాత 103 అవుతాయి.

అమిత్ షా సీట్లు తగ్గే ప్రశ్న లేదని చెప్పారు కాబట్టి మొత్తం లోకసభ సీట్లు పెంచుతారని అనుకోవాలి. అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గదు కానీ నిష్పత్తి తగ్గుతుంది. ఉదాహరణకి 740 కు పెంచారనుకుంటే అప్పుడు దక్షిణాది రాష్ట్రాల శాతం ప్రస్తుతం ఉన్న 24 నుంచి 19కి తగ్గుతుంది. అమిత్ షా దాస్తున్నది యిదే! తమిళనాడు వాటా 7.2 నుంచి 5.4కి పడిపోతుంది. కొంతమంది ఎత్తి చూపేది ఏమిటంటే – జనాభాలో లెక్కలోకి తీసుకోకూడదు అంటే ప్రస్తుతం ఒక యుపి లేదా రాజస్థాన్ ఎంపీ 32 లక్షల మందికి ప్రాతినిథ్యం వహిస్తూండగా, కేరళ ఎంపీ 19 లక్షల మందికే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కానీ యీ ఎంపీలందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఇది ఎనామలీ కాదా అని! దీన్ని రాజ్యాంగం ముందుగానే గుర్తించి, చిన్న రాష్ట్రాలకు ఆ వెసులుబాటు యిచ్చింది. ఆ మాటకు వస్తే ఒకే రాష్ట్రం లోనే తేడాలున్నాయి. తెలంగాణలో శేరి లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 7.65 లక్షల ఓటర్లుంటే, భద్రాచలంలో 1.54 ఉన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గంలో 31.50 ఓటర్లుంటే, ఆదిలాబాద్‌లో 13.86 ఉన్నారు. వీటిలో శాస్త్రీయత ఉందా?

అసలు డీలిమిటేషన్ చేస్తున్నపుడు యింత జనాభాకు యింతమంది ఎమ్మెల్యేలు అనే సూత్రం పాటిస్తున్నారా? అనే అనుమానం వస్తుంది. రాష్ట్రంలోనే ఒక్కో నియోజకవర్గం ఒక్కో సైజులో ఉంటోంది. నిజానికి ఎంపీలు అనేవాళ్లు విధాన పరమైన నిర్ణయాలపై చర్చిస్తారు. ప్రజల సమస్యల గురించి పోరాడవలసినది ఎసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలు. వాళ్ల నియోజకవర్గాలు మేనేజబుల్ సైజులో ఉంటే సబబుగా ఉంటుంది. ఇంతకాలం ఎలా నడిచినా, కొత్తగా చేపట్టినప్పుడైనా ఒక పద్ధతి ప్రకారం చేయాలిగా! కానీ 2022లో జమ్మూ కశ్మీర్‌లో చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియ చూస్తే దానిలో ఏ మేరకు రాజకీయాలు చోటు చేసుకున్నాయో అర్థమౌతుంది. జమ్మూలో ఆరు సీట్లు పెంచి, కశ్మీర్ లోయలో మాత్రం ఒకటే పెంచి, జమ్మూ ఓటరుకి 1.2 వెయిటేజి వచ్చేట్లు చేశారు. పైగా జమ్మూలోని పూంచ్, రాజౌరీలను లోయలోని అనంత్‌నాగ్‌ పార్లమెంటు నియోజకవర్గంలో చేర్చి, అక్కడి ఫలితాలను ప్రభావితం చేసేందుకు దోహదపడ్డారు.

జమ్మూలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరు నియోజకవర్గాలలో హిందూ మెజారిటీ ఉండేట్లు చూశారు. ముస్లిం మెజారిటీ ఉన్న దూరు వంటి నియోజకవర్గాల్లో జనాభా 1.92 లక్ష, సురన్‌కోట్‌లో జనాభా 1.77 లక్షలుండగా, వైష్ణోదేవి, పద్దేర్, దోడా వంటి హిందూ మెజారిటీ నియోజకవర్గాల్లో జనాభా 50 వేలు దరిదాపుల్లో ఉంది. కిస్త్‌వార్ అనే ముస్లిం మెజారిటీ నియోజకవర్గానికి ఇందర్‌వెల్ నియోజకవర్గంలో కొన్ని భాగాలను కలిపి దాన్ని హిందూ మెజారిటీ నియోజకవర్గంగా మార్చారు. అంటే పునర్విభజనకు ఏ శాస్త్రీయతా లేదు, కేవలం రాజకీయాలే ముఖ్యం. దీన్ని అన్ని రాజకీయ పార్టీలూ నిరసించాయి – బిజెపి తప్ప!

ఇక 2023లో అసాంలో చేపట్టిన డిలిమిటేషన్ గురించి చెప్పాలంటే అసెంబ్లీలో నియోజకవర్గాల సంఖ్యను ఫ్రీజ్ చేశారు. అయితే దానికి ముందే అసాం బిజెపి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు జిల్లాలలను తమ ఒరిజినల్ జిల్లాలలో కలిపేసి, జిల్లాల సంఖ్యను 35 నుంచి 31 చేసింది. ఈ దెబ్బకి 10 ముస్లిం మెజారిటీ నియోజకవర్గాలు ఎగిరిపోయి, హిందూ, ట్రైబల్ మెజారిటీ నియోజకవర్గాలు ఆ మేరకు పెరిగిపోయాయి. ఇంకా వివరాలు కావాలంటే రాధా కుమార్ రాసిన ‘‘ఎ డిలిమిటేషన్ రెడ్ ఫ్లాగ్ – ద లెసన్స్ ఫ్రమ్ జెఅండ్‌కె, అసాం’’ అనే వ్యాసం చదవవచ్చు.

ఉత్తరాదిన, తూర్పున ముస్లిం మెజారిటీ నియోజకవర్గాల స్వరూపాలను మార్చడం ద్వారా ఆధిపత్యం సాధిస్తున్న బిజెపి, తనకు దుర్భేద్యంగా ఉన్న దక్షిణాది ప్రాధాన్యాన్ని 2026 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టడం ద్వారా తగ్గించి, ఉత్తరాదిలో ప్రాబల్యంతో తన చిత్తం వచ్చినట్లు పాలిద్దామని చూస్తోంది. దురదృష్టమేమిటంటే ఆంధ్ర నాయకులు దీన్ని ఎదిరించలేక ఉన్నారు. జగన్ ప్రధానికి ఉత్తరం రాసి ఊరుకుంటే, చంద్రబాబు దీని గురించి కిమ్మనటం లేదు. పైగా ఉత్తరాది వారిని మించి పిల్లల్ని కని, వారికి జవాబు చెప్పండి అని పిలుపు నిస్తున్నారు. మనం జనాభా పెంచిన దాకా ఉండి, మరో 20 ఏళ్లకు ఉత్తరాది వారు అప్పటి తమ పరిస్థితికి అనుకూలంగా డీలిమిటేషన్ రూలు మార్చేస్తే అప్పుడీ పిల్లల్నేం చేయాలి? ఏఐ ద్వారా మాతృగర్భంలోకి మళ్లీ పంపేయగలమా? బాబు గారి 2047 విజన్‌లో యీ అంశం ఉందో లేదో!

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2025)

mbsprasad@gmail.com

90 Replies to “ఎమ్బీయస్‍: వినుడు స్టాలిన్ని.. కనుడు పిల్లల్ని”

  1. జనాభా అధికంగా ఉన్న ఉత్తరాదివాళ్ళకి అయాచితంగా ప్రధానమంత్రి పదవి తో సహా , ఎంపీ లు , అయ్యా ఎస్ లు , బులెట్ రైలు , కొత్తగా వచ్చే నిధులు, అన్ని రకాల ప్రభుత్వ ఉద్యాగాలు దాదాపు అన్ని వాళ్ళకే వస్తున్నాయి కదా

    దక్షిణాది వాళ్లేమో 90 గెంటలు కష్టపడే ఐ.టీ ఉద్యోగాలు లాంటివి సస్తూ పడుతూ చేసి కుటుంబాన్ని భారంగా నెట్టుకు రావాల్సి వస్తుంది

  2. అందుకే ఒంటరి సింహం ఢిల్లీ లో జూలు విదిలించే సమయం వచ్చేసింది..

  3. ఈ ఆర్టికల్ రాసినవాడు దేశం లో నేనే తెలివైన వాడిని అని అనుకుంటాడు, వీడి దృష్టిలో వీడు, వీని తరువాత 11 రెడ్డి తెలిసినవాళ్ళు.

  4. Show me proof where babu called for population increase for politics purpose ? He called it the purpose of human resources increase as old people number is growing.

    1. What did I write? ఇప్పుడీ డీలిమిటేషన్ గొడవ వచ్చింది కాబట్టి పిల్లల్ని కనండి అనే పల్లవి స్టాలిన్ అందుకున్నాడు కానీ బాబు కొన్నాళ్ల క్రితమే మొదలుపెట్టారు. ఏమిటో ఆ విజనరీ విజన్!

      1. I think his perspective of his statement north Indians are helping us is….. Already in total south India most of non -IT , non- office works , construction works are doing by north Indians only..

        In villages also we are not getting many power for agriculture purpose because of many reasons.

        1. You did not read his statement in that conference. He gave fertility rates of states and said in case of fertility rate north Indian states are saving us. It is not a favour to us if someone comes to us for labour work for low wages. Local unemployment is on rise and it may lead to rise in crime rate.

          1. then who is the reason for exploding population in north? like central govt or high populus states? and why south only taking pain and not north in terms of tax, resources, longer working hours and un-employment , educated south people migrating to other developed countries whereas in North fully corrupted and high population and most of the south tax money spending on them to keep that un-necesary population

        1. This article is about CBN vision, not Jagan’s. I am opposing that vision. If you are supporting, give your logic. There is no employment or support to present generation and how can one ensure about needs of future manpower?

  5. Vulgar comments you can delete … But normal comments also you r deleting… Bhayapaddadu…

    You can comment on anyone … But others can’t comment you

    1. వ్యాఖ్యల పట్ల నా విధానమేమిటో అనేకసార్లు చెప్పాను. అశ్లీలమే కాదు, అసందర్భమూ వద్దంటాను. మీరు వ్యాసంలో కంటెంట్ గురించి ఎంతైనా చర్చించండి, పాఠకులకూ, నాకూ కూడా ప్రయోజనం.

      నా గురించి రాయడం దేనికి? మీరు రాసిన ఒక కామెంటు Babu population increase cheyamani cheppindhi delimitation kosam kaadhu… Future man power kosam… ఇక్కడి వరకు బాగానే ఉంది. తర్వాత Final GA kukka Thoka vankara అని ఎందుకు చేర్చారు? అది నింద కాదా?

      ఈ తోక లేకుండా మళ్లీ మీరు మరో వ్యాఖ్య రాస్తే దానికి జవాబిచ్చాను చూశారా? నాకు కావలసినది డిస్కషన్!

      ఇక Mee manavadiki anna Peru pettukunnarantaga అనే కామెంటు సభ్యమైనదా? దానికీ, ఆర్టికల్‌కు సంబంధం ఉందా? మీరు మా యింట్లో వాళ్ల మాట ఎత్తితే నేను మీ యింట్లో వాళ్లు యిలాగటగా, అలాగటగా అని సమాధానం యివ్వాలా? ఇలాటి సంస్కారం పెట్టుకుని ‘భయపడొద్దు, కామెంట్స్ ఉంచండి ’ అంటూ హితోపదేశం ఒకటి!

      ప్రతి పది నిమిషాలకు క్లీన్ చేయాల్సి వస్తోందని నాపై జాలి పడనక్కరలేదు. వాకిలి ముందు శుభ్రం చేసి పెట్టుకున్నాక, రెట్టలు పడితే తుడుచుకోక తప్పదు. దీనికి కూడా కొంత సమయం కేటాయించి పెట్టుకుంటాను. ఓ ఆరడజను మందికి వేరే పనేమీ లేదు, నా వ్యాసం అప్‌లోడ్ చేయగానే, చదవను కూడా చదవకుండానే నా గురించి ఏవేవో కామెంట్స్ పెట్టేసి ఆనంద పడిపోతూ ఉంటారు.

      ఫ్యూచర్ మాన్‌పవర్ కోసం యిప్పటివాళ్లు పిల్లల్ని యిబ్బడిముబ్బడిగా కనాలన్న బాబు లాజిక్ నాకు నచ్చలేదు. విమర్శించాను. మీకు నచ్చితే దానికి సమర్థిస్తూ పాయింట్లు రాయండి. ఇప్పటి జనరేషన్స్‌కే ఉద్యోగాలివ్వలేక పోతున్నారు, ఫ్యూచర్ వాళ్లకి ఏమిస్తారు? అని అడిగేవాళ్లు అడుగుతారు. మంచి చర్చావేదిక తయారవుతుంది.

      అన్నిటికంటె ముందు సంస్కారం నేర్చుకోండి. మీ మనవడి పేరు.., మీకు పేమెంట్స్… వంటి చౌకబారు కామెంట్లు మానండి.

      ఈ వ్యాసంలో ఎన్నో పాయింట్లు టచ్ చేశాను. దీన్ని ఆవు వ్యాసంగా పేర్కొనడంలోనే మీ అవగాహన ఏ పాటిదో తెలుస్తోంది.

      1. Y mentioned Aavu vyasam means .. ela tippina babu dhaggarake testharu…

        Now in reply you mentioned you agreed for his perspective is for future manpower.. may be it’s wrong…but that subject of human resources and his perspective you didn’t wrote in your article.

        Maaku subject vimrsa ki , vidveshapu vimarsaki difference telusu… You write 10000 things against babu .. but we r expecting remove that your inside hater while writing as you r putting it in public platform.

        1. but that subject of human resources and his perspective you didn’t wrote in your article.

          • I am worried about the present generation and the difficulties of unemployment and perils of bringing up children.
          • Apart from focusing on Stalin, I talked about Babu too because he is also promoting producing more children and talking against family planning and praising north for having no control over explosion of population.
          • I also criticized him for not raising his voice against delimitation, which is harmful to the interests of Southern states.
          • Avu vyasam refers to rhetoric, devoid of any stuff. I gave several points why I am differing with Stalin and Babu. You just wanted to deride me and used that phrase.
      2. What is the need of editing. Is it because mentioning the duplicity of mentality about mentioning Sita’s mandir comment by Amit Sha and devasting of several mandirs after 1947.

        In India every progressive masked liberal intellectual is a rogue. This one is one among them

      3. నువ్వు ముందు సరిగ్గా ఉంటే, నీమీద వచ్చే కామెంట్లు కూడా సరిగ్గానే ఉంటాయి

        వెధవలకి వెధవల భాషలో చెప్పినప్పుడే కదా అర్ధం అయ్యేది

      4. MBS Prasad, nuvvu ChandraBabu nu yeka vachanam tho sambodinchavu, mari nenu ninnu yeka vachanam tho sambodisthe noppi yemiti?

        ika topic pointlu

        fertility ratlu padipoyayi

        pillalu vaddanukuntunnavaru yekkuvi potunnaru

        LGBQT+ neku telusa? danivalla kooda pillalu puttataledu

      5. నిజమే, మేము కౌంటర్ ఇవ్వబట్టే, నీలాంటి అబద్దాల కోరు వాస్తవమైన బ్రతుకు బయటపడిపోయింది. ఒక పదేళ్ళ క్రితం నీమీద ఉన్న గౌరవం ఇవాళ శూన్యమైపోవటానికీ మేమే కారణం. నీ అబద్దాల బ్రతుకును ఎండగడుతూనే ఉంటాము

        1. నువ్వు రాసే అర్ధసత్యాల చెత్తను పూర్తిగా చదవాలా ? ఆ అబద్దాలను ఎత్తి చూపుతాము. నీకు వ్యతిరేకంగా ఉన్న కామెంట్స్ ను తీసేసి నిన్ను నువ్వు కాపాడుకుంటావు. నీకు ఈ సౌకర్యం ఇవ్వకముందు నిన్ను వ్యతిరేకించిన వాళ్ళందరని బిఎల్‍ఓసీకే చేయించేవాడివీ. అదీ నీ బ్రతుకు

      6. “ఈయన కంటే ఆచంట మల్లన్న అమరావతి లో వున్నాడు ఆయనకు ఒకడే కొడుకు, ఆ కొడుకుకి కూడా ఒకడే కొడుకు ” ఈలా మీరు రాసుకోవచ్చు. పాఠకుడు నోట్లో వేలేసుకు చదవాలి మరి

  6. మనకు రకరకాల సీజన్డ్ మేధావులు తగులుతూ ఉంటారు. వాళ్ళు నమ్మకమే జాతి నమ్మకం కావాలి అని వాళ్ళ ప్రగాఢనమ్మకం

    అమిత్ షా సీతా మాత గుడి గురించి అన్నది హైలైట్ చేసిన పెద్దమనిషి రాములోరి గుడి కట్టింది ప్రజల విరాళలతోనా ప్రభుత్వఖజానాతోనా అన్నది చెప్పడు. హజ్ యాత్రల సబ్సిడీ సొమ్ము ఇఫ్తార్ విందుల ఔచిత్యం గుర్తుకు రాదు. ఎందుకంటే అభ్యుదయ మేధావి కదా !

    1947 నుండీ దేశంలో ఎన్ని మసీదులు కూల్చి బీజేపీ మోడీ అమిత్ షాలు గుళ్ళూ కట్టారో, అదే సమయంలో ఇదే దేశంలో ఎన్ని గుళ్ళు కూల్చారో చెప్పే నిజాయితీ కూడా ఉంటే బాగుంటుంది.

    30+ కోట్ల జనాభా ఉన్న మొత్తం దక్షిణాదికి 130 సీట్లు ఉన్న సంగతీ 25 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు కేవలం 80 సీట్లు మాత్రమే ఉండటంలో ఉన్న ఔచిత్యం ప్రశ్నించడు.

    7 కోట్ల తమిళనాడుకు 39 సీట్లు — 6 కోట్ల గుజరాత్ కు 26 సీట్లు ఎందు మూలంగా అని అడగడు

    ఉత్తరప్రదేశ్ బీహార్ కంట్రిబ్యూషన్ అడిగాడు సరే, మహారాష్ట్ర గుజరాత్ కంట్రిబ్యూషన్ సంగతి కూడా చెప్పాలి కదా !

    3.5 కోట్ల జనాభా ఉన్న కేరళకు 20 ఎంపీ సీట్లు , కడుతున్న పన్నులు 3000 కోట్లు,

    2.7 కోట్ల జనాభా ఉన్న హర్యానా కడుతున్న పన్నులు 12000 కోట్లు . ఎంపీ సీట్లు 10 మాత్రమే.

    ఈయనకు హమ్ పాంచ్ హమే పచ్చీస్ ఎక్కడా కనపడలేదు. ఒక్కసారి వికిపీడియా లోకి వెళ్ళి ఫెర్టిలిటీ రేట్ ఏ మతాల్లో ఎంతో స్పష్టంగా తెలుసుకోవచ్చు. సాంపిల్ గా బాగా గోల చేస్తున్న తమిళనాడే తీసుకుంటే హిందువులది 1.61 అయితే ముస్లింలది 2.11. కాకపోతే హిందూత్వవాదుల ఘోష కాబట్టి అవహేళన చేసేసి తానొక అభ్య్య్దయవాదిని అని కాలర్ ఎగరేసుకోవచ్చు.

    పిల్లల్ని కనటంతోనే జనాభా పెరగదు కదా, పక్కదేశాలనుండీ అక్రమంగా వచ్చేవారి సంగతి, వారికి ఆశ్రయం ఇచ్చేవారి సంగతి కూడా చెప్పాలి కదా ! వాళ్ళకు అండగా నిలబడే సెక్యులర్ నాయకులూ జడ్జీలూ లాయర్లూ మేధావుల గురించి కూడా చెప్పాలి కదా ! అప్పుడే కదా జనాభా గురించి జనానికి నిజాలు తెలిసేది. ఒంటికంటితో విశ్లేషణలు ఎన్నాళ్ళు?

    “ఇందులో వ్యక్తిగత ధూషణలేమీ లేవు కదా ! సబ్జెక్ట్ మీద డిస్కషనే కదా !”

    ఇంకా రాయొచ్చు, కానీ ఎలాగూ తీసేసే దాని మీద ఇంకా చేతుల నొప్పి ఎందుకు ?

    1. అసలు ఉత్తరప్రదేశ్ ని 5 భాగాలుగా విభజించాలి, ఒక్కో భాగానికి 16 ఎంపీ సీట్స్ తో , అంటే 5 కోట్ల జనాభాకి 16 మంది అంటే చాలా ఎక్కువ MP సీట్స్ , విద్య రాని వెధవలు ఎక్కువ అందుకే అక్కడ మోడీ గెలవగలుగుతున్నాడు

      1. విద్య బెమ్మాండంగా వచ్చిన నీలాంటి తెలుగువాళ్ళు గెలిపించింది ఎవరిని? లక్షల కోట్ల అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళనే కదా !

        నీకంటే ఆ చదువురాని వాళ్ళు తీసిపోయారా ? యోగీకీ ఏ మచ్చా లేదు. పక్కన ఉన్న ఏ బీజేపీ ముఖ్యమంత్రికీ ఏ మచ్చాలేదు. వాజపేయీకీ అద్వానీకీ మోడీకీ లేదా ఏ ఇతరమంత్రికీ మచ్చల్లేవు

        మరి నువ్వు నయమా చదువురాని ఆ మొద్దులు నయమా దేశానికి ?

          1. నేను చెప్పింది కూడా అదే. చదువులేని ఉత్తరప్రదేశ్ వాళ్ళను అనుకునే బదులు, ఎదవలను గెలిపించి వాళ్ళ మీద దేశం ఆధారపడేట్లు చేసే చదువుకున్న మేధావులను అనాలి అనే

        1. యడ్యూరప్ప గొప్ప సీఎం మరి, ఆఖరికి వాడి మీద పోక్సో కేస్ కూడా ఉంది , పెద్ద అవినీతి తిమింగలం.

          1. పోనీలే కష్టపడి యెడ్యూరప్ప ఉదాహరణ పట్టుకున్నావు. కాబట్టి మీరు వేసిన అవినీతి మురుగులో దొర్లే నాయకుల పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయాయి.

          2. Cm కాకుండానే గాలి జనార్దన్ రెడ్డి ఎంత పోగేసుకున్నాడో అందరికీ తెలుసు. కళ్లు మూసుకొని ఉంటే ఇవన్నీ కనపడవులే. ఇంకా ఆపు నీ సోది.

        2. నువ్వు చెప్పేది ఎలా ఉంది అంటే మచ్చ ఉండాలి , గళ్ళ లుంగీ కట్టుకోవాలి , ఎర్ర గుడ్డ ఒకటి మెడకు చుట్టుకోవాలి అప్పుడే నేను వాడిని గుర్తిస్తాను అంటే కుదరదు ఇప్పటి దొం!గ!లు అంతా మోడీ లాగ లేక యోగి లాగ కాషాయం వస్త్రాలు కట్టుకుంటున్నారు

          1. అవినీతిపరులకు ఓటేసే నీలాంటివాళ్ళే అవినీతి గురించి ఎక్కువగా అరిచేది

          2. గత మూడు సార్లు గా కేంద్రం లో అవినీతి చేసినోళ్లనే గెలిపిస్తున్నాం…అవినీతి సొమ్ము ఎక్కువయ్యి వాళ్ళు గళ్ళ లుంగీలు కాకుండా పైజామా కుర్తీలను ధరిస్తున్నారు , popcorn మీద కూడా 28% పన్నులు వసూల్ చేసే నీచ స్థితికి చేరారు అత్యాశాపరులు

    2. What is the need of editing. Is it because mentioning the duplicity of mentality about mentioning Sita’s mandir comment by Amit Sha and devasting of several mandirs after 1947.

      In India every progressive masked liberal intellectual is a rogue. This one is one among them

    3. 1980లో యూపీ జనాభా 8.8 కోట్లు అయితే తమిళనాడు జనాభా 4.7 కోట్లు. ఇప్పుడు ఇప్పుడు యూపీ 20 కోట్లు, తమిళనాడు 7.8 కోట్లు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేయడం తప్పంటారా సుధాకర్రావుగారు?

  7. మన సగటు ప్రగతిశీల అభ్యుదయ సెక్యులర్ మేధావుల కామన్ లక్షణాలు

    చావా సినిమాను ముస్లింల మనోభావాలు దెబ్బతీసాయి అనేవాళ్ళు ఉదయనిధి లాంటి వాళ్ళు మరికొందరు సమాజ్‍వాదీ తదితర పార్టీ నాయకులు చేసిన హిందూ అవమాన వ్యాఖ్యల వరకూ వచ్చేసరికి భావప్రకటనా స్వేఛ్చ అంటూ నీతులు మప్పుతారు. కూనల్ కాన్రా అనే ప్రొఫెషనల్ హిందూ వ్యతిరేకి శివసేన నాయకుడి మీద చేసిన వెగటు కామెడీ మీద బుల్‍డోజర్ నడిపితే ఖండించిన పెద్దలు అంతకు ముందు కంగనా రనౌత్ ఇంటి మీద నడిపిన బుల్‍డోజర్ ను వెనకేసుకు వస్తారు.

    చిన్న కార్టూన్ వేసిన పాపానికి ఒక కార్టూనిస్టు ను ఏడాది జైల్లో ఉండిన మమత, తన మీద ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది అని ఒక యువనటిని జైలు పాలు చేసిన శరద్ పవార్, తన మీద సెటైర్ వేసాడని సబ్ లోక్‍తంత్ర్ రచిత్ కౌసిక్ ను పంజాబ్ పోలీసులతో అరెస్టు చేయించిన కేజ్రీవాల్, సోనీయా గాంధీని అసలు పేరుతో పిలిచినందుకు మహారాష్ట్ర పోలీసులతో అరెస్ట్ చేయించిన సోనియా గాంధీ— ఇలాంటివి ఎన్నో

    కానీ ఏ ప్రగతిశీల సెక్యులర్ అభ్యుదయవాది నోరు విప్పడు.

    ఈ హిపోక్రసీకి అర్ధమే లేదు.

    థాంక్స్ టూ సోషల్ మీడియా. వలువలు విప్పి రోడ్డున నిలబెట్టి నిజరూపాన్ని మాకు చూపుతున్నందుకు

  8. మన సగటు ప్రగతిశీల అభ్యుదయ సెక్యులర్ మేధావుల కామన్ లక్షణాలు

    చావా సినిమాను ముస్లింల మనోభావాలు దెబ్బతీసాయి అనేవాళ్ళు ఉదయనిధి లాంటి వాళ్ళు మరికొందరు సమాజ్‍వాదీ తదితర పార్టీ నాయకులు చేసిన హిందూ అవమాన వ్యాఖ్యల వరకూ వచ్చేసరికి భావప్రకటనా స్వేఛ్చ అంటూ నీతులు మప్పుతారు. కూనల్ కాన్రా అనే ప్రొఫెషనల్ హిందూ వ్యతిరేకి శివసేన నాయకుడి మీద చేసిన వెగటు కామెడీ మీద బుల్‍డోజర్ నడిపితే ఖండించిన పెద్దలు అంతకు ముందు కంగనా రనౌత్ ఇంటి మీద నడిపిన బుల్‍డోజర్ ను వెనకేసుకు వస్తారు.

    1. చిన్న కార్టూన్ వేసిన పాపానికి ఒక కార్టూనిస్టు ను ఏడాది జైల్లో ఉండిన మమత, తన మీద ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది అని ఒక యువనటిని చెరసాల పాలు చేసిన శరద్ పవార్, తన మీద సెటైర్ వేసాడని సబ్ లోక్‍తంత్ర్ రచిత్ కౌసిక్ ను పంజాబ్ పోలీసులతో అరెస్టు చేయించిన కేజ్రీవాల్, సోనీయా గాంధీని అసలు పేరుతో పిలిచినందుకు మహారాష్ట్ర పోలీసులతో అరెస్ట్ చేయించిన సోనియా గాంధీ— ఇలాంటివి ఎన్నో

      కానీ ఏ ప్రగతిశీల సెక్యులర్ అభ్యుదయవాది నోరు విప్పడు.

      ఈ హిపోక్రసీకి అర్ధమే లేదు.

      థాంక్స్ టూ సోషల్ మీడియా. వలువలు విప్పి రోడ్డున నిలబెట్టి నిజరూపాన్ని మాకు చూపుతున్నందుకు

    2. చిన్న కార్టూన్ వేసిన పాపానికి ఒక కార్టూనిస్టు ను ఏడాది జైల్లో ఉండిన మమత, తన మీద ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది అని ఒక యువనటిని చెరసాల పాలు చేసిన శరద్ పవార్, తన మీద సెటైర్ వేసాడని సబ్ లోక్‍తంత్ర్ రచిత్ కౌసిక్ ను పంజాబ్ పోలీసులతో అ///రె////స్టు చేయించిన కేజ్రీవాల్, సోనీయా గాంధీని అసలు పేరుతో పిలిచినందుకు మహారాష్ట్ర పోలీసులతో అరెస్ట్ చేయించిన సోనియా గాంధీ— ఇలాంటివి ఎన్నో

      కానీ ఏ ప్రగతిశీల సెక్యులర్ అభ్యుదయవాది నోరు విప్పడు.

    3. చిన్న కార్టూన్ వేసిన పాపానికి ఒక కార్టూనిస్టు ను లోపల వేయించిన మమత, తన మీద ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది అని ఒక యువనటిని చెరసాల పాలు చేసిన శరద్ పవార్, తన మీద సెటైర్ వేసాడని సబ్ లోక్‍తంత్ర్ రచిత్ కౌసిక్ ను పంజాబ్ పోలీసులతో అ///రె////స్టు చేయించిన కేజ్రీవాల్, సోనీయా గాంధీని అసలు పేరుతో పిలిచినందుకు మహారాష్ట్ర పోలీసులతో అరెస్ట్ చేయించిన సోనియా గాంధీ— ఇలాంటివి ఎన్నో

      కానీ ఏ ప్రగతిశీల సెక్యులర్ అభ్యుదయవాది నోరు విప్పడు.

      ఈ హిపోక్రసీకి అర్ధమే లేదు.

      థాంక్స్ టూ సోషల్ మీడియా. వలువలు విప్పి రోడ్డున నిలబెట్టి నిజరూపాన్ని మాకు చూపుతున్నందుకు

  9. The edited part of my comment, it is not because of out of ontext nor abusive, it is because of highlighting of his hypocrisy

    మనకు రకరకాల సీజన్డ్ మేధావులు తగులుతూ ఉంటారు. వాళ్ళు నమ్మకమే జాతి నమ్మకం కావాలి అని వాళ్ళ ప్రగాఢనమ్మకం

    అమిత్ షా సీతా మాత గుడి గురించి అన్నది హైలైట్ చేసిన పెద్దమనిషి రాములోరి గుడి కట్టింది ప్రజల విరాళలతోనా ప్రభుత్వఖజానాతోనా అన్నది చెప్పడు. హజ్ యాత్రల సబ్సిడీ సొమ్ము ఇఫ్తార్ విందుల ఔచిత్యం గుర్తుకు రాదు. ఎందుకంటే అభ్యుదయ మేధావి కదా !

    1947 నుండీ దేశంలో ఎన్ని మసీదులు కూల్చి బీజేపీ మోడీ అమిత్ షాలు గుళ్ళూ కట్టారో, అదే సమయంలో ఇదే దేశంలో ఎన్ని గుళ్ళు కూల్చారో చెప్పే నిజాయితీ కూడా ఉంటే బాగుంటుంది.

  10. మనకు రకరకాల సీజన్డ్ మేధావులు తగులుతూ ఉంటారు. వాళ్ళు నమ్మకమే జాతి నమ్మకం కావాలి అని వాళ్ళ ప్రగాఢనమ్మకం

    అమిత్ షా సీతా మాత గుడి గురించి అన్నది హైలైట్ చేసిన పెద్దమనిషి రాములోరి గుడి కట్టింది ప్రజల విరాళలతోనా ప్రభుత్వఖజానాతోనా అన్నది చెప్పడు. హజ్ యాత్రల సబ్సిడీ సొమ్ము ఇఫ్తార్ విందుల ఔచిత్యం గుర్తుకు రాదు. ఎందుకంటే అభ్యుదయ మేధావి కదా !

    1947 నుండీ దేశంలో ఎన్ని మసీదులు కూల్చి బీజేపీ మోడీ అమిత్ షాలు గుళ్ళూ కట్టారో, అదే సమయంలో ఇదే దేశంలో ఎన్ని గుళ్ళు కూల్చారో చెప్పే నిజాయితీ కూడా ఉంటే బాగుంటుంది.

    1. నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలు అంతే గాని గుడి కడతాం విరాళాలు ఇవ్వండి అని అడుక్కోవటం ఏంటి విడ్డూరం

      1. గత పదేళ్ళల్లో ఆర్ధికస్థితి 4 వస్థానానికి ఎగిసింది. అలాగే పారిశ్రామిక అభ్వృద్ది 118% పెరిగింది. అంటే ఉద్యోగావకాశాలు పెరగకుండానే అలానే ఉన్నవా ? నోటికి ఏది వస్తే అదే చెప్పటం అంటే నీ తెలివితేటల స్థాయీ అర్ధం అవుతున్నది.

        పైన జనాభా పెరుగుదల గురించి కామెంట్ పెటావు. ఫర్టిలిటీ రేట్ గురించి గూగుల్ లో డాటా అందుబాటులో ఉన్నది. నీకేమైనా చేతనయితే అది విశ్లేషించి అప్పుడు కామెంట్ పెట్టు

        మా గుడి మా డబ్బుతో కట్టుకోవాల్సిందే. మీకు లాగా మాకు విదేశీశక్తుల నుండి సొమ్ములు అందవు

      2. గత పదేళ్ళల్లో ఆర్ధికస్థితి 4 వస్థానానికి ఎగిసింది. అలాగే పారిశ్రామిక అభ్వృద్ది 118% పెరిగింది. అంటే ఉద్యోగావకాశాలు పెరగకుండానే అలానే ఉన్నవా ? నోటికి ఏది వస్తే అదే చెప్పటం అంటే నీ తెలివితేటల స్థాయీ అర్ధం అవుతున్నది.

        1. పైన జనాభా పెరుగుదల గురించి కామెంట్ పెటావు. ఫర్టిలిటీ రేట్ గురించి గూగుల్ లో డాటా అందుబాటులో ఉన్నది. నీకేమైనా చేతనయితే అది విశ్లేషించి అప్పుడు కామెంట్ పెట్టు

        2. ఫర్టిలిటీ రేట్ గురించి గూగుల్ లో డాటా అందుబాటులో ఉన్నది. నీకేమైనా చేతనయితే అది విశ్లేషించి అప్పుడు కామెంట్ పెట్టు

        3. మా గుడి మా డబ్బుతో కట్టుకోవాల్సిందే. మీకు లాగా మాకు విదేశీశక్తుల నుండి సొమ్ములు అందవు

        4. నీ కలలోకి వచ్చి యోగి చెప్పాడా ఆర్థికం, ఉద్యాగాలు పెరిగాయి అని ,మాటలు వచ్చు కదా అని ఉత్తుత్తి లెక్కలు చెప్పటం కాదు , ఆర్థికం పెరిగితే జనాభా తగ్గుద్ది అంటే డీలిమిటేషన్ వల్ల నార్త్ లో ఎంపీ సీట్స్ తగ్గాలి కానీ పెరుగుతున్నాయి అంటే ఉత్తుత్తి లెక్కలతో మోసం చేయాలనీ చూడకు

  11. మన సగటు ప్రగతిశీల అభ్యుదయ సెక్యులర్ మేధావుల కామన్ లక్షణాలు

    చావా సినిమాను ముస్లింల మనోభావాలు దెబ్బతీసాయి అనేవాళ్ళు ఉదయనిధి లాంటి వాళ్ళు మరికొందరు సమాజ్‍వాదీ తదితర పార్టీ నాయకులు చేసిన హిందూ అవమాన వ్యాఖ్యల వరకూ వచ్చేసరికి భావప్రకటనా స్వేఛ్చ అంటూ నీతులు మప్పుతారు. కూనల్ కాన్రా అనే ప్రొఫెషనల్ హిందూ వ్యతిరేకి శివసేన నాయకుడి మీద చేసిన వెగటు కామెడీ మీద బుల్‍డోజర్ నడిపితే ఖండించిన పెద్దలు అంతకు ముందు కంగనా రనౌత్ ఇంటి మీద నడిపిన బుల్‍డోజర్ ను వెనకేసుకు వస్తారు.

    చిన్న కార్టూన్ వేసిన పాపానికి ఒక కార్టూనిస్టు ను లోపల వేయించిన మమత, తన మీద ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది అని ఒక యువనటిని చెరసాల పాలు చేసిన శరద్ పవార్, తన మీద సెటైర్ వేసాడని సబ్ లోక్‍తంత్ర్ రచిత్ కౌసిక్ ను పంజాబ్ పోలీసులతో అ///రె////స్టు చేయించిన కేజ్రీవాల్, సోనీయా గాంధీని అసలు పేరుతో పిలిచినందుకు మహారాష్ట్ర పోలీసులతో అరెస్ట్ చేయించిన సోనియా గాంధీ— ఇలాంటివి ఎన్నో

    కానీ ఏ ప్రగతిశీల సెక్యులర్ అభ్యుదయవాది నోరు విప్పడు.

    ఈ హిపోక్రసీకి అర్ధమే లేదు.

    థాంక్స్ టూ సోషల్ మీడియా. వలువలు విప్పి రోడ్డున నిలబెట్టి నిజరూపాన్ని మాకు చూపుతున్నందుకు

    1. ఒక రచయిత లేదా విశ్లేషకుడు..ఆయా వ్యక్తుల మనస్తత్వాలను పరిశీలించేటప్పుడు..కొంచెం సాన్నిహిత్యం కలిగి ఉండక తప్పదు. ఇందులో ఆక్షేపించిదేమి లేదు..ముఖ్యంగా ప్రజాసేవకులు గురించి..అలాగే కళా సేవకుల గురించి..ఎంటివోడు,నాగ్గాడు, కిట్టి గాడు వంటి అభిమానుల అరుపులు మనం విన్నవే కదా!

  12. బాగా విశ్లేషించారు.. ముందు సంపద (జీ డీ పీ) పెంచే ఏర్పాటు చెయ్యండి..అధిక సంతానం రాజకీయ అజెండా కాకూడదు..ఎంత మంది పిల్లల్ని కనాలానేది..ఆయా కుటుంబాల నిర్ణయం..ఈ విషయంలో ప్రభుత్వ లేదా రాజకీయ జోక్యం ప్రమాదకరం….

    1. అదేదో ఉత్తర భారతీయులకి చెప్పాల్సింది అధిక సంతానం వొద్దు దానితో డీలిమిటేషన్ అనే రాజకీయ పబ్బం గడుపుకోవొద్దు అని

  13. You wrote only about Babu vision. Why you didnt mention vision of a person who is fighting for opposition leader? I am pretty sure if you go and ask him about his view on delimitation he will say I dont have any “limits”. Yes, babu has good vision thats why he got elected. Please try to change your thinking and provide constructive views. I used to like your views and writings few years back, now by reading title it self we can guess what you are going writing but still reading because may be with this one our guess will be wrong and Prasad will change his views.

  14. మీకు అన్ని తెలిసినట్టు రాస్తారు గాని అందులో 50% నిజం ఉండదు… ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళు దక్షిణాది వచ్చి కూలి పని చేస్తున్నారు అన్నారు.. వాళ్ళు IT ఉగ్యోగాల్లో లేరా.. పోయు NCR లోకేషన్ లో చూడండి, దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు గల్ఫ్ కి వెళ్లి 100 దినార్లు, 1000 దిర్హం లకు చేసే పాకీ పనులు, డ్రైవర్, వంట పని వాళ్ళు కనిపించలేదా… నేను చేసిన అన్ని IT కంపెనీ లల్లో ఆయా రాష్ట్రాల వాళ్ళు ఉన్నారూ… ఎందుకు ఉత్తరాది అని యూపీ, బీహార్ కి మాత్రమే పరిమితం చేస్తున్నారు.. అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, పంజాబ్ లతో దక్షిణాది రాష్ట్రాలను పోల్చవచ్చు కదా.. కేరళ, తమిళనాడు సొంతంగా రాష్ట్రాలు ఆదాయం పొందుతున్నాయ.. వాటికి వచ్చే ఆదాయం అంత గల్ఫ్, మలేసియా, సింగపూర్ నుండి.. దాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వల ఖాతాల్లో ఎలా వేస్తారు… మీరు వేర్పాటువాదాన్ని, దేశ విభజన కు ఉసిగొల్పేలా వ్రాసారు. మన రాష్ట్రాల్లో పట్టణాలు ఎక్కువ టాక్స్ కడుతున్నాయ్ రూరల్ కంటే మా డబ్బులు ఉచిత పథకాల రూపంలో పల్లెలకు రైతులకు ఎందుకు ఖర్చు పెడతారు… మేము ఇన్కమ్ మాత్రమే సంవత్సరం కి 10 లక్షలు కడుతున్నాం అని మిగతా ఇన్కమ్ టాక్స్ కట్టని అలగా జనం తో మేము ఎందుకు కలసి ఉండాలి.. మా కులపు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మా కులపు వాళ్ళు ఎక్కువ టాక్స్ కడుతున్నారు మాకు సెపరేట్ రాష్ట్రాలు, జిల్లాలు కావాలి.. ఆ రాష్ట్రాలకు మా కులపు వాళ్ళ పేర్లు పెట్టాలి.. ఇందులో కూడా న్యాయం ఉంది కదా….

    1. నేను 16 ఏళ్లుగా అమెరికాలో ఐటీ రంగంలో ఉన్నాను సర్, ప్రతి పదిమంది తెలుగు వాళ్ళకి ఒక ఉత్తరప్రదేశ్ వాళ్లు ఉంటే గొప్ప. మీకు దేశభక్తి ఎక్కువైతే ఎక్కువైతే మీరు సంపాదించిన డబ్బు మిగతా భారతీయులకి పంచండి కానీ క్రమశిక్షణతో ఉన్న రాష్ట్రాలకి శిక్ష వేసి అవి లేని రాష్ట్రాలని నెత్తికి ఎత్తుకోవద్దు.

  15. మిగతా పాయింట్స్ సంగతి తర్వాత కానీ తమిళ చిత్రాల తెలుగు వర్షన్స్ కి తెలుగు పేర్లు ఎందుకు పెడుతున్నారంటే సోషల్ మీడియాలో ఒక్కో భాషకి ఒక్కో హాష్ టాగ్ వేయడం కష్టం అవుతుంది కాబట్టి. అంతకు మించి ఇంకే దురుద్దేశం లేదు.

Comments are closed.