జనసేన ఎమ్మెల్యేల ఆవేదన?

పవన్, మనోహర్ నియోజకవర్గాలు రెండూ పక్కన పెడితే మిగిలిన 19 నియోజక వర్గాలు జనసేనకు శాశ్వతంగా వుంటాయని అనుకోవడానికి లేదు.

ఉన్నట్లుండి తెలుగుదేశం అనుకూల డిజిటల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రత్యక్షమయ్యాయి. జనసేన ఎమ్మెల్యేలు అంతా విజయవాడలో సమావేశం అయ్యారని, నాదెండ్ల మనోహర్ దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్నారని ఆ వార్తల సారాశం. ఇంతకీ ఆ గోడు ఏమిటంటే, తమ తమ నియోజకవర్గంలో తెలుగుదేశం ఇన్ చార్జిల మాటే చెల్లుబాటు అవుతోందని, తమకు పనులు కావడం లేదన్నది. నిజమే. దీని కోసం మీటింగ్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇది కనుక్కోవడానికి పెద్దగా గూఢచర్యం అక్కరలేదు.

జనసేనకు ఇచ్చిన సీట్లు అన్నీ తెలుగుదేశం పార్టీవే. కానీ పొత్తు అనివార్యం, జనసేన సాయం కావాల్సిందే కనుక ఆ సీట్లు అన్నీ త్యాగం చేసారు. కానీ ఎప్పటికైనా అక్కడ తెలుగుదేశం జనాలు వున్నారు. నాయకులు వున్నారు. వారికి పదవులు ఇవ్వకపోయినా ఫరవాలేదు కానీ లోకల్ గా ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎలా? అల్టిమేట్ గా రాజకీయాలు అన్నీ డబ్బు సంపాదన కోసమే. అది కాదనలేని సత్యం. ఒక్కో ఎమ్మెల్యే పదుల కోట్లలో ఖర్చు చేసి గెలిచారు. అంతకు ముందు అయిదేళ్ల పాటు కోట్లు ఖర్చు చేసి రాజకీయం చేసారు.

అందువల్ల పనుల విషయంలో ఆవురావురు మంటూ వుంటారు. తెలుగుదేశం జనాలకు సీనియార్టీ వుంది వారికి పనులు ఎలా సాధించుకోవాలో తెలుసు. జనసేన జనాల్లో బయట నుంచి వచ్చిన వారి సంగతి పక్కన పెడితే కొత్తవాళ్లకు అంత పట్టు లేదు. అందువల్ల తెలుగుదేశం జనాలను ఢీకొని పనులు సాధించలేరు.

ఇక్కడ ఇంకో సమస్య వుంది. ఏమాత్రం తొందరపడినా, ఢీ అంటే ఢీ అన్నా జనసేన ఎమ్మెల్యేల మీద తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పవన్ కు ఫిర్యాదు వెళ్తుంది. ఆయన నుంచి వార్నింగ్ వస్తుంది. ఇదీ జనసేన వర్గాల్లో వినిపిస్తున్న మాట. నాయకుడు ఇలా వున్నపుడు ఎమ్మెల్యేలు ఏం చేయగలరు

వన్ థర్డ్ పదవులు అడిగి తీసుకుందాం అని పవన్ ఎన్నికల ముందు చెప్పారు. కానీ వన్ థర్డ్ కాదు కదా వన్ ఫిప్త్ కూడా రావడం లేదు. పైగా జనసేనకు ఇచ్చే కోటాను భాజపాకు మళ్లిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇన్ని బాధలు వున్నపుడు ఎమ్మెల్యేలు వాపోవడం పెద్ద కొత్త, వింత వార్త కాదు. కానీ దీని వల్ల ఒరిగేది ఏమీ వుండదు. తెలిసినా తెలియనట్లు వుంటారు అధినేతలు ఎప్పుడూ. ఎందుకంటే వారి దగ్గర ధైర్యంగా ఎలాగూ నోరు విప్పరు కదా.

పవన్, మనోహర్ నియోజకవర్గాలు రెండూ పక్కన పెడితే మిగిలిన 19 నియోజక వర్గాలు జనసేనకు శాశ్వతంగా వుంటాయని అనుకోవడానికి లేదు. అందువల్ల జనసేన జెండా పై గెలిచిన ఎమ్మెల్యేలు తమ బాధలు తాము పడుతూ నాలుగేళ్లు ఈదుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే.

14 Replies to “జనసేన ఎమ్మెల్యేల ఆవేదన?”

  1. ప్రతీ వారం ఈ “స్టాండర్డ్ స్టాక్ ఆర్టికల్స్” ఉండాలని ఆర్డర్

    1. కూటమి పార్టీ ల మధ్య పుల్లలు పెట్టే గ్యాస్ ఆర్టికల్స్ ఓ 11
    2. మాడామోహనచెడ్డీకి ‘లేని ఎలివేషన్స్ ఇస్తూ ఓ డజను
    3. అవినీతి అరాచకం అంటూ ఇంకో డజను
    4. Red బుక్కు రాజ్యాంగం అంటూ ఓ 4
    5. చంద్రబాబు తో compare చేస్తూ A1’సైకో బిహేవియర్ ఆలా ఎందుకు లేదే అంటూ బాధపడుతూ ఓ 3
  2. ప్రతీ వారం ఈ “స్టాండర్డ్ స్టాక్ ఆర్టికల్స్” ఉండాలని ఆర్డర్

    1. కూటమి పార్టీ ల మధ్య పుల్లలు పెట్టే గ్యాస్ ఆర్టికల్స్ ఓ 11
    2. మాడామోహనచెడ్డీకి ‘లేని ఎలివేషన్స్ ఇస్తూ ఓ డజను
    3. అవినీతి అరాచకం అంటూ ఇంకో డజను
    4. Red బుక్కు రాజ్యాంగం అంటూ ఓ 4
    5. చంద్రబాబు తో compare చేస్తూ A1’సైకో బిహేవియర్ ఆలా ఎందుకు లేదే అంటూ బాధపడుతూ ఓ 3
  3. మరి ఆ 21 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లు చెప్పగలవా? అందులో గెలిచే మొఖాలేవో లెక్క చూసుకున్నావా?

    ..

    పిఠాపురం లో గొడవలు అంటూ వందల కొద్దీ ఆర్టికల్స్ వండేస్తూ ఉంటావు కదా..

    వైసీపీ అభ్యర్థి ఎవరో .. ఒక్క ఆర్టికల్ రాయి.. నీకు దమ్ముంటే..

    ..

    చివరికి పులివెందుల లో కూడా వైసీపీ కి అభ్యర్థి లేడు..

    అదీ నీ జగన్ రెడ్డి పరిస్థితి..

    1. మన అన్న k^kk@ ని నిలపెట్టిన గెలిచేస్తది.. సో అభ్యర్థులు తో పని ledu

      1. పర్లేదు.. ఆ కుక్కల పేర్లే చెప్పమంటున్నాను..

        మరీ నీచం గా ఎమ్మెల్యే అభ్యర్థి ని కు క్క అంటూ పిలవలేము కదా..

    2. Vanga geetha Or Mudragada

      Mari next election lo 175 constituencies me contestants list publish chey chalu…

      Atleast 50 places lo deposit raadhu…Jenasena ki…2019 121 places lo deposit raledhu.that is a record

      Paristiti maradaniki oka sandarbam chalu..

Comments are closed.